News July 11, 2025

జఫర్‌గఢ్ కోటలో ఫిరంగుల కథ ఏంటో తెలుసా?

image

జనగామ జిల్లా జఫర్‌గఢ్ కోటలో ఫిరంగులు లోహపు మిశ్రమంతో తయారయ్యాయి. ఇవి శత్రువులపై దాడికి, కోట రక్షణ కోసం ఉపయోగించేవారు. కొంతమంది చారిత్రక పరిశోధకులు ఈ ఫిరంగులను మొఘల్ సామ్రాజ్యానికి చెందిన మిలిటరీ ఇంజినీర్లు తయారు చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. కొన్నింటిపై అరబిక్ లిపి కనిపిస్తుంది. దీనిని చూసి ఇవి ముస్లిం పాలకుల కాలానికి చెందినవని అంచనా వేస్తారు. ఈ కోటకు మీరు వెళ్లారా? కామెంట్ చేయండి.

Similar News

News July 11, 2025

త్వరలోనే TDP ఉనికి గల్లంతు: పెద్దిరెడ్డి

image

వచ్చే ఎన్నికల్లో YCP విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని MLA పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఎర్రాతివారిపల్లెలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన జీవితంలో మామిడిని రూ.2కే కొనడం ఎప్పుడూ చూడలేదన్నారు. కర్ణాటక కిలో మామిడిని రూ.16 మద్దతు ధరతో భారీగా అమ్ముతుంటే మన పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. త్వరలో TDP ఉనికి గల్లంతవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

News July 11, 2025

రూ.180 కోట్ల చెల్లింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

image

AP: 2014-19 మధ్య జరిగిన ఉపాధిహామీ పనుల బిల్లులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పేమెంట్లు ఇవ్వలేదని, ఐదేళ్ల పాటు సమాచారం ఇవ్వకపోవడంతో కేంద్రం ఆ ఫైళ్లను మూసివేసిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తాము పదేపదే విజ్ఞప్తులు చేయడంతో రూ.180 కోట్ల విలువైన 3.5 లక్షల ఉపాధి హామీ పనులను కేంద్రం రీస్టార్ట్ చేస్తూ బిల్లులు చెల్లించేందుకు అంగీకరించిందని వివరించింది.

News July 11, 2025

KNR: దుర్గాభవాని అమ్మవారికి కూరగాయలు, ఆకుకూరల అలంకరణ

image

కరీంనగర్ నగునూరులోని శ్రీ దుర్గాభవాని ఆలయంలో జరుగుతున్న ఆషాఢమాసం శాకాంబరీ ఉత్సావాలలో భాగంగా గురువారం పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరల మాలలతో అలంకరించారు. అమ్మవారికి ఆలయ పూజారులు విశేష హారతులు, ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ పూజలలో ఆలయ చైర్మన్ వంగల లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.