News April 1, 2024

జమ్మలమడుగు బరిలో డాక్టర్ V/s టీచర్

image

రాష్ట్ర రాజకీయాల్లో జమ్మలమడుగుకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం YCP నుంచి సిట్టింగ్ MLA డా. మూలె సుధీర్ రెడ్డి మరోసారి బరిలో ఉన్నారు. ఒకప్పుడు వరుస విజయాలతో జమ్మలమడుగులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ఆది నారాయణ రెడ్డి మరోసారి తన హవా కొనసాగించేందుకు కూటమి అభ్యర్థిగా సిద్దమయ్యారు. రాజకీయాలకు ముందు కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేశారు. మరి ఇద్దరిలో గెలుపెవరిదో కామెంట్ చేయండి.

Similar News

News February 8, 2026

కడపలో నేడు పోటీలు.. గెలిస్తే రూ.70 వేలు.!

image

కడప నగరంలోని బిల్డప్ దగ్గర కొలువైన పోలేరమ్మ తల్లి తిరుణాల సందర్భంగా ఆదివారం బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మొదటి బహుమతి రూ.70 వేలు, రెండో బహుమతి రూ.50 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఇలా ఐదు బహుమతులు వరకు ఉంటాయన్నారు. ఎద్దుల యజమానులు నిర్దేశించిన సమయంలో అక్కడికి చేరుకోవాలని కమిటీ సభ్యులు తెలిపారు.

News February 7, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరులో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.16,040
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.14,757
* 10 గ్రాముల వెండి ధర: రూ.2,670.

News February 7, 2026

పెండింగ్ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలి..!

image

కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల ఎన్ఆర్ఈజీఎస్ పనులను ఈ ఆర్థిక సవత్సరంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే పనులు మొదలు పెట్టి పురోగతిలో ఉన్న వాటిని మార్చి 15 లోపు పూర్తి చేయాలన్నారు.