News December 28, 2025

జమ్మికుంట: అంబేద్కర్ వర్సిటీ పరీక్షా ఫీజు గడువు పొడిగింపు

image

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు పరీక్షా ఫీజు చెల్లించే గడువును జనవరి 2వ తేదీ వరకు పొడిగించినట్లు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బి.రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దూరవిద్య విధానంలో బి.ఏ, బి.కామ్‌, బి.ఎస్సీ చదువుతున్న మొదటి, మూడు, ఐదో సెమిస్టర్‌ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News February 17, 2026

కరీంనగర్ ‘నగరాధిపత్యం’ కమలం వశం!

image

కరీంనగర్ మున్సిపల్ పోరులో బీజేపీ ఉత్కంఠ విజయం సాధించింది. మేయర్ ఎన్నికలో బీఆర్ఎస్ తటస్థంగా ఉండటంతో, మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. బండి సంజయ్ వ్యూహంతో కొలగాని శ్రీనివాస్ మేయర్‌గా పీఠమెక్కారు. దశాబ్ద కాలం నగరాన్ని ఏలిన గులాబీ పార్టీ కేవలం 9 స్థానాలకే పరిమితమై ఉనికి కోసం పోరాడుతోంది. ప్రస్తుతం జిల్లా రాజకీయం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే హోరాహోరీగా సాగుతోంది.

News February 17, 2026

కరీంనగర్‌లో రేపు జాబ్ మేళా

image

నిరుద్యోగ యువతీయువకులకు రేపు జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్లోని గోదావరిఖని బైపాస్ రోడ్డు కేబుల్ వంతెన సమీపంలోగల ఓ కంపెనీలో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. టీమ్ లీడర్, సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఆఫీసర్, ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్స్ సహా మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వివరాలకు కాల్- 9908230384.

News February 16, 2026

కరీంనగర్ మేయర్ పీఠంపై సందిగ్ధత!

image

కరీంనగర్ నగరపాలక సంస్థలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. మేయర్ పీఠం దక్కించుకునేందుకు బీజేపీకి 34 ఓట్ల బలం ఉండగా, కాంగ్రెస్ కూటమికి 35 ఓట్లు ఉన్నట్లు భావించారు. అయితే, అనూహ్యంగా బీఆర్ఎస్ మద్దతు ఉపసంహరించుకున్నట్లు జరుగుతున్న ప్రచారంతో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ సహకరించని పక్షంలో మేయర్ పీఠం కమలం వశమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.