News July 2, 2024
జమ్మికుంట: ఈరోజు పత్తి ధర రూ.7,500
జమ్మికుంట పత్తి మార్కెట్‌లో పత్తి ధర నిలకడగానే కొనసాగుతుంది. మంగళవారం మార్కెట్‌కు రైతులు 12 వాహనాల్లో 184 క్వింటాల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,500, కనిష్ఠంగా రూ.7,200 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. పత్తి ధరలు పెరగకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. మార్కెట్లో కొనుగోలు పక్రియ జోరుగా సాగుతుంది.
Similar News
News November 29, 2024
రాజన్న ఆలయంలో ఆకట్టుకున్న కార్తీక దీపోత్సవం
దక్షిణ కాశీగా పేరుందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిత్యం వైభవంగా నిర్వహిస్తున్నారు. గురువారం కార్తీక మాసం పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో స్థానిక భక్తులు ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగిస్తూ తన్మయత్వం పొందుతున్నారు. రకరకాల ఆకారాలతో భక్తి శ్రద్దలతో దీపాలను వెలిగిస్తున్నారు.
News November 28, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి.
@ మల్లాపూర్ మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ గొల్లపల్లి మండలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.
@ రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా ఉంచాలన్న జగిత్యాల ఎస్పీ.
@ పెగడపల్లి మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.
News November 28, 2024
హుస్నాబాద్ నూతన పురపాలక సంఘానికి బొప్పారాజు పేరు: మంత్రి పొన్నం
హుస్నాబాద్‌లో నూతన పురపాలక సంఘ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం, సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి కలిసి మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత, కమిషనర్ మల్లికార్జున్‌లను చైర్‌లో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ అనిత, కౌన్సిలర్లు, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి రెడ్డి తదితరులున్నారు.