News December 23, 2025
జమ్మికుంట: క్వింటా పత్తి ధర రూ.7,400

మూడు రోజుల విరామం అనంతరం సోమవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ ఈరోజు ప్రారంభమైంది. కాగా, పత్తి ధర స్వల్పంగా తగ్గింది. మార్కెట్‌కు 43 వాహనాల్లో 278 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా, గరిష్ఠంగా క్వింటాకు రూ.7,400, కనిష్ఠంగా రూ.7,000 ధర పలికింది. గత వారం కంటే ధర రూ.50 తగినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా తెలిపారు.
Similar News
News December 30, 2025
‘12 గ్రేప్స్ థియరీ’.. ఈ సెంటిమెంట్ గురించి తెలుసా?

కొత్త ఏడాది అంతా మంచి జరగాలని కోరుకుంటూ పాటించే సెంటిమెంట్లలో ‘12 గ్రేప్స్ థియరీ’ ఒకటి. స్పెయిన్ సంప్రదాయం ప్రకారం డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు నిమిషానికి ఒకటి చొప్పున 12 ద్రాక్ష పండ్లను తినాలి. ఒక్కో పండు ఏడాదిలోని ఒక్కో నెలకు సంకేతం. ఇలా తింటూ బలంగా సంకల్పించుకుంటే ఆ ఏడాదంతా అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని చాలామంది నమ్ముతుంటారు. న్యూఇయర్ వేళ SMలో ఈ మేనిఫెస్టేషన్ ట్రెండ్ వైరలవుతోంది.
News December 30, 2025
KNR: యూరియా సరఫరా నిరంతరం పర్యవేక్షించాలి

వ్యవసాయ అధికారులు ప్రతిరోజు మండల, క్లస్టర్ స్థాయిలో యూరియా సరఫరాను పర్యవేక్షించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మండల వ్యవసాయ అధికారులు, ప్రాథమిక సహకార సంఘాల అధికారులతో ఆమె మాట్లాడారు. యూరియా నిల్వలు, సరఫరా, వ్యవసాయశాఖ, కేంద్రప్రభుత్వ పథకాలు, ధాన్యం కొనుగోలు, తదితర అంశాలపై చర్చించారు.
News December 30, 2025
ప్రకాశం, మార్కాపురం జిల్లాల ఏర్పాటు.. తుది నిర్ణయం

ప్రకాశం, మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. మార్కాపురం జిల్లా పరిధిలో 21 మండలాలు ఉండగా, మార్కాపురం డివిజన్ పరిధిలో 15, కనిగిరి డివిజన్ పరిధిలో 6 మండలాలు ఉండనున్నాయి. ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి మొత్తం 28 మండలాలు ఉండనుండగా.. కందుకూరి డివిజన్ పరిధిలో 7, ఒంగోలు పరిధిలో 11, అద్దంకి డివిజన్ పరిధిలో 10 మండలాలతో ఉండనుంది. రేపే కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు.


