News July 10, 2025
జమ్మికుంట: గంజాయి విక్రయం.. నలుగురి అరెస్టు

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఎఫ్‌సీఐ సమీపంలో నిషేధిత గంజాయి అమ్మేందుకు వచ్చిన నలుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు హుజురాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్‌లో పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. రెండు బైకులపై వచ్చిన నలుగురు యువకులను పట్టుకుని విచారించి వివరాలు సేకరించినట్లు చెప్పారు.
Similar News
News September 10, 2025
KNR: ప్రజల్లో చైతన్యం నింపిన కాళోజీ: కలెక్టర్

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు 111వ జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్వినీ తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాకవి కాళోజీ నారాయణరావు తన కవిత్వం, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని అన్నారు.
News September 9, 2025
KNR: SRR విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు

కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్(సీపీగెట్) పరీక్ష ఫలితాల్లో SRR ప్రభుత్వ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. కామర్స్ విభాగంలో అక్కెం తిరుమలకు రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు, జంగం నందిని 3వ ర్యాంకు సాధించారు. బాటనీ విభాగంలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు పుట్టి అఖిల సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
News September 9, 2025
KNR: ఈనెల 11 నుంచి IFWJ జాతీయ సమావేశాలు

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఈనెల 11- 13 తేదీల్లో ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ సమావేశాలు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా 500 మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశాల్లో డిజిటల్ జర్నలిజం, జర్నలిస్టుల రక్షణ, పెన్షన్ స్కీం వంటి అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ నుంచి 25 మంది ప్రతినిధులు పాల్గొననున్నారని KNR జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ కార్యదర్శి కుడుతాడు బాపురావు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమంతో సమావేశాలు ప్రారంభమవుతాయి