News October 7, 2025

జమ్మికుంట: గూడ్స్ రైలు కింద పడి వ్యక్తి మృతి

image

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం రైల్వే గేటు వద్ద గూడ్స్ రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కాజీపేట- రామగుండం రైల్వే లైన్‌లో రామగుండం వైపు వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడి మండలంలోని శాయంపేట గ్రామానికి చెందిన పంజాల సాగర్(43) ప్రాణాలు కోల్పోయాడు. అయితే మృతుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ప్రమాదానికి గురై మృతి చెందాడా? అనే విషయం తెలియాల్సి ఉంది.

Similar News

News October 7, 2025

చెవిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

image

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన దాఖలు చేసిన ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన A- 39గా ఉన్నారు.

News October 7, 2025

ఆర్మూర్: పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలి: సబ్ కలెక్టర్

image

ఆర్మూర్ డివిజన్ స్థాయిలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల విధులలో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులు క్షణక్షణం అప్రమత్తతో ఉంటూ ఎలక్షన్ కమిషన్ సూచనలు పాటిస్తూ ఎన్నికలు సజావుగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో DLPO శివకృష్ణ, ఎంపీడీఓలు శివాజీ, గంగాధర్ తదితరులున్నారు.

News October 7, 2025

‘కాళేశ్వరం’ రిపోర్టు.. హైకోర్టులో విచారణ వాయిదా

image

TG: కాళేశ్వరం కమిషన్ నివేదికపై దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటూ మాజీ సీఎం KCR, హరీశ్ రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఇటీవల ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం ఇవాళ 2 వారాల గడువు కోరింది. దీంతో తదుపరి విచారణను వచ్చే నెల 12కి కోర్టు వాయిదా వేసింది.