News April 9, 2025
జమ్మికుంట: నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులపై దూసుకెళ్లిన కారు

నిద్రిస్తున్న వ్యక్తులపై కారు దూసుకెళ్లిన ఘటన జమ్మికుంటలో చోటుచేసుకుంది. సీఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. లారీ డ్రైవర్లు సుమన్ కుమార్ మహత్, పబిత్ర మాజీ సోమవారం రాత్రి 10.30లకు ఆదిత్య కాటన్ ఇండస్ట్రీస్ ఎదురుగా నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో మోత్కులగూడెంకు చెందిన పొనగంటి సాత్విక్ కారును అజాగ్రత్తగా నడుపుకుంటూ.. వాళ్ల కాళ్ల మీద నుంచి వెళ్లాడు. దీంతో వాళ్ల కాళ్ల విరిగిపోయాయి.
Similar News
News February 20, 2026
మధ్యాహ్నం ఒంటి గంట వరకే ఉర్దూ పాఠశాలలు: డీఈవో

రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ప్రభుత్వం ముస్లింలకు శుభవార్త చెప్పింది. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల నేపథ్యంలో ఉర్దూ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పని చేస్తాయని అనంతపురం డీఈవో ప్రసాద్ బాబు తెలిపారు. రంజాన్ మాసం ముగిసిన తర్వాత పాఠశాలలు యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు.
News February 20, 2026
Stocks: నష్టాల్లోంచి లాభాల్లోకి..

నిన్నటి నష్టాలను కొనసాగిస్తూ ఇవాళ కూడా రెడ్‌లో మొదలైన స్టాక్ మార్కెట్లు తేరుకున్నాయి. వాల్యూ బయింగ్‌లో భాగంగా ఇన్వెస్టర్లు మెటల్, బ్యాంక్ స్టాక్స్‌పై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో సెన్సెక్స్ క్రమంగా లాభాల్లోకి వచ్చి ప్రస్తుతం 400 పాయింట్లు గ్రీన్‌లో కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 143 పాయింట్లు లాభాల్లో ఉంది.
News February 20, 2026
DRDOలో JRF పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

బెంగళూరు <


