News March 15, 2025
జమ్మికుంట: రైల్వేపట్టాలపై యువతి, యువకుడి మృతదేహాలు

జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్- పాపయ్యపల్లి గ్రామాల మధ్య రైల్వే పట్టాల పక్కన యువతీ, యువకుడి మృతదేహాలు కలకలం రేపాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రేమజంటగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే పోలీసులు మృతదేహాల వద్ద పంచనామా నిర్వహించి, వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిసమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News March 16, 2025
కరీంనగర్: రైలు పట్టాల పక్కన యువజంట మృతదేహాలు (UPDATE)

జమ్మికుంట(M) పాపయ్యపల్లి-బిజిగిరి షరిఫ్ గ్రామాల రైల్వే ట్రాక్ మధ్య శనివారం రాత్రి ఓ <<15773958>>యువజంట<<>> మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. మృతిచెందిన యువకుడు ఇల్లందకుంట(M) రాచపల్లికి చెందిన మెనగు రాహుల్(18)గా గుర్తించారు. ప్రమాదంలో ఇద్దిరి తలలకు మాత్రమే గాయాలున్నాయి. ఒంటిపై ఎక్కడా గాయాలులేవు. దీంతో ఇది ఆత్మహత్య? లేక హత్య అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
News March 16, 2025
ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలోనే టాప్ కరీంనగర్

ఉమ్మడి జిల్లాలో ఎండ దంచికొడుతోంది. శనివారం కరీంనగర్ జిల్లా బూర్గుపల్లిలో 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో 41.5, జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 41.1, పెద్దపల్లి జిల్లా మంథనిలో 40.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి.
News March 15, 2025
జమ్మికుంట: రైలుకింద పడి వ్యక్తి మృతి

జమ్మికుంట రైల్వేస్టేషన్లో వ్యక్తి మృతిచెందాడు. రైలు ఎక్కుతుండగా కొమురయ్య (50) జారిపడి చనిపోయాడు. మృతుడు రైల్వేలో గ్యాంగ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడు స్వస్థలం హనుమకొండ జిల్లా సోమిడి.