News November 1, 2025
జమ్మికుంట రైల్వే ప్లాట్‌ఫారంపై గుర్తు తెలియని మహిళ మృతి

జమ్మికుంట రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంపై గుర్తు తెలియని 50ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమె బ్రౌన్ నైటీ ధరించి ఉండగా, అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తింపు కార్డులు లభించలేదు. శవాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వివరాలు తెలిసినవారు 9949304574, 8712658604 లకు తెలుపగలరని రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి కోరారు.
Similar News
News November 1, 2025
మైనారిటీలకు ఫ్రీగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్

AP: మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా శిక్షణ ఇస్తామని చెప్పారు. త్వరలో క్లాసులు ప్రారంభం అవుతాయన్నారు. అభ్యర్థులు తమ వివరాలను <
News November 1, 2025
చిత్తూరు: CKబాబు కేసులో తప్పించుకున్నా..!

ఇంజినీరింగ్ చదివిన చింటూ చిత్తూరులో బలమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా ఎదిగాడు. బెదిరింపులు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం, హత్యాయత్నం తదితర కేసులు అతనిపై ఉన్నాయి. బంగారుపాళ్యం, కర్ణాటకలో సైతం కేసులు ఉండటంతో చింటూపై రౌడీషీట్ తెరిచారు. మాజీ MLA సీకేబాబుపై హత్యాయత్నం కేసులో చింటూ అరెస్ట్ కాగా.. నేరం నిరూపణ కాలేదు. ఆ కేసులో క్లియరెన్స్ వచ్చింది. మేయర్ హత్య కేసులో మాత్రం ఉరిశిక్ష పడింది.
News November 1, 2025
అదునులో పొదలో చల్లినా పండుతుంది

సక్రమంగా వర్షాలు కురిసి, నేల అదునుగా ఉన్నప్పుడు విత్తనాలు చల్లితే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. ఒకవేళ నేలమీద పొదలు అడ్డమున్నా ఆ పొదల నుంచి జారి నేలమీద పడ్డ గింజలు నేల అదునుగా ఉంటే పండితీరుతాయి. అలాగే సమయం, సందర్భం కలిసొచ్చినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే విజయం తప్పక లభిస్తుందని తెలియజెప్పే సందర్భాలలో దీన్ని ఉపయోగిస్తారు.


