News March 21, 2025
జమ్మికుంట: శ్రీశైలం డ్యామ్‌లో పడి విద్యార్థి మృతి

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సాగర్ల సాయి తేజ (19) తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ఏపీలోని శ్రీశైలం వెళ్లాడు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అక్కడ జలాశయంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. కాగా సాయితేజ HYDలో పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సాయితేజ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 28, 2025
రూ.14 లక్షలు పలికిన ఒంగోలు గిత్త

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలోని డి.రంగాపురం గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి ఒంగోలు జాతి గిత్తను రూ.14 లక్షలకు విక్రయించారు. ప్రకాశం జిల్లా ముదిరముప్పాల గ్రామానికి చెందిన శేషాద్రి చౌదరి గిత్తను కొనుగోలు చేశారు. ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఈ ఒంగోలు గిత్త ఎడ్ల పోటీల్లో సత్తా చాటుతోంది. ఇది వరకు పలు పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానాల్లో బహుమతులను గెలుపొందింది.
News March 28, 2025
సీతంపేట : మంచంపై నుంచి పడి విద్యార్థి మృతి

సీతంపేట మండలం దోనుబై ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న చలపతి శుక్రవారం మృతి చెందాడు. హాస్టల్‌లో తన బెడ్ నుంచి కిందికి దిగేప్పుడు కాలు జారిపడ్డాడు. ప్రమాదంలో చెవి భాగం వైపు గట్టిగా తగలటం వలన రక్తం రావటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తన తోటి స్నేహితులు చెప్తున్నారు. దోనుబై S.I ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిది కారెంకాగుమానుగడుగా సమాచారం.
News March 28, 2025
శ్రీశైల మహా క్షేత్రంలో పుష్పాలతో అలంకరణ

శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా శుక్రవారం ధ్వజస్తంభం, ఆలయ ప్రాంగణంలో వివిధ పుష్పాలతో అలంకరణ ఘనంగా చేశారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర భక్తులు భారీ ఎత్తున శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. ఆలయ అధికారులు భక్తుల రద్దీ సందర్భంగా వారికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.