News March 21, 2025

జమ్మికుంట: శ్రీశైలం డ్యామ్‌లో పడి విద్యార్థి మృతి

image

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సాగర్ల సాయి తేజ (19) తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ఏపీలోని శ్రీశైలం వెళ్లాడు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అక్కడ జలాశయంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. కాగా సాయితేజ HYDలో పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సాయితేజ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News February 26, 2026

BREAKING: నిజామాబాద్ అదనపు కలెక్టర్ బదిలీ

image

నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పని చేస్తున్న అంకిత్ (2019 బ్యాచ్) కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది IAS అధికారులను బదిలీ చేస్తూ CS రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అంకిత్‌ను భద్రాద్రి కొత్త గూడెం కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్‌ను TGSPDCL ఛైర్మన్&MDగా బదిలీ చేశారు.

News February 26, 2026

టాపార్డర్ కుప్పకూలాలని ప్రార్థిస్తుంటా: జితేశ్ శర్మ

image

టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ జితేశ్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నా జట్టు టాప్ ఆర్డర్ కుప్పకూలాలని నేను దేవుడిని ప్రార్థిస్తుంటా. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వెళ్తేనే నాకు హీరో అయ్యే అవకాశం వస్తుంది. అలాంటి సవాళ్లను ఎదుర్కోవడం నాకిష్టం. జట్టును ఆదుకునే మ్యాజికల్ ఇన్నింగ్స్‌ ఆడాలని కోరుకుంటా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

News February 26, 2026

హనుమకొండ జిల్లాలో రైతు ఆత్మహత్య

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్ గ్రామంలో అప్పుల బాధతో రైతు కన్న గౌరి (39) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.5 లక్షల అప్పులు చేసి పంటలు పండక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ నెల 20న విషం తాగగా, చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా బుధవారం మృతి చెందాడు. భార్య స్రవంతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.