News April 9, 2025

జమ్మికుంట: స్వల్పంగా తగ్గిన పత్తి ధర

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా తగ్గింది. నిన్న క్వింటా పత్తి ధర రూ.7,540 పలకగా.. ఈరోజు రూ.7,520 పలికింది. బుధవారం యార్డుకు రైతులు 75 క్వింటాళ్ల విడిపత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,520, కనిష్ఠంగా రూ.7,150 పలికింది. గోనె సంచుల్లో 5 క్వింటాలు తీసుకురాగా.. రూ.5,600 నుంచి రూ.6,300 వరకు పలికింది. కొనుగోళ్లను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం పరిశీలించారు.

Similar News

News March 6, 2026

UPDATE: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

<<19312594>>బైక్‌ను టిప్పర్<<>> ఢీకొన్న ఘటనలో చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చిలుక ప్రదీప్ కుమార్, తాటికొండ సాయి కిరణ్ మృతి చెందారు. శుక్రవారం ఈ ఇద్దరు మిత్రులు బైక్‌పై వెళుతుండగా చాకుంట ఎక్స్ రోడ్డు వద్ద అతి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరి యువకుల తలలు నుజ్జునుజ్జు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 6, 2026

రామడుగు: రెండు రోజుల్లో పెండ్లి.. ఇంతలోనే దారుణం..!

image

పెళ్లిబాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. రామడుగుకు చెందిన ఈరెల్లి గౌరమ్మ (65) తన పెద్ద కుమారుడి వివాహ ఏర్పాట్లలో ఉండగా, హత్యకు గురి కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘాతుకం వెనుక తెలిసిన వారే ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్తి గొడవలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

News March 6, 2026

నేడు కరీంనగర్‌కు మంత్రుల రాక: ‘ప్రజా పాలన’పై సమీక్ష

image

కరీంనగర్ జిల్లాలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ నిర్వహణపై సమీక్షించేందుకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర మంత్రులు శుక్రవారం నగరానికి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే ఈ కీలక సమావేశంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. ప్రగతి ప్రణాళిక అమలు, ప్రజా సమస్యల పరిష్కార మార్గాలపై ఈ సందర్భంగా దిశానిర్దేశం చేయనున్నారు.