News February 19, 2026

జమ్మికుంట: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా పెరిగింది. బుధవారం క్వింటా పత్తి ధర రూ.7,500 పలుకగా.. బుధవారం రూ.50 పెరిగి రూ.7,550 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. గురువారం మార్కెట్‌కు రైతులు 34 వాహనాల్లో 244 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకువచ్చినట్లు చెప్పారు. మార్కెట్‌కు పత్తిని తీసుకువచ్చే రైతులు నాణ్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News February 21, 2026

పత్తి కొనుగోళ్లకు నెలాఖరు వరకు అవకాశం

image

TG: రాష్ట్రంలోని పత్తి రైతులకు ఊరట లభించింది. ఈ నెలాఖరు వరకు కొనుగోళ్లు చేపట్టనున్నట్లు సీసీఐ తెలిపింది. పత్తి కొనుగోళ్ల గడువును పొడిగించాలంటూ ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఈక్రమంలోనే కేంద్ర జౌళిశాఖకు అధికారులు లేఖ కూడా రాశారు. దీంతో గడువు పొడిగిస్తున్నట్లు సీసీఐ తెలిపింది.

News February 21, 2026

చిత్తూరు జిల్లా రైతులకు గమనిక

image

ప్రభుత్వం రైతు విశిష్ట సంఖ్య కోసం నమోదు ప్రక్రియ చేపట్టింది. చిత్తూరు జిల్లాలో 2.55 లక్షల మంది రైతులు ఉండగా 2లక్షల మంది వివరాలే ఇప్పటికీ నమోదయ్యాయి. పీఎం కిసాన్, పంట నష్టం, బీమా, భూసార పరీక్షలు, విత్తనాల పంపిణీకి ఈ సంఖ్య ఎంతో ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. ఈ నంబర్ లేకపోతే పథకాలు రావు.

News February 21, 2026

KNR: అటు అన్నదాత.. ఇటు విద్యార్థికి సవాలే!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం ఒక విలక్షణమైన వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు రైతులకు నీటి కోసం పరీక్ష ఎదురవుతుంటే, మరోవైపు తరగతి గదుల్లో వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అగ్నిపరీక్ష మొదలైంది. ఈ గడ్డు కాలాన్ని తట్టుకుని నిలబడితేనే రైతులకు లాభం, విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుంది. అటు వ్యవసాయ క్షేత్రం, ఇటు విద్యా క్షేత్రం రెండూ ఇప్పుడు జిల్లా అభివృద్ధికి కీలక పరీక్షగా నిలిచాయి.