News April 12, 2025
జమ్మిచేడు జమ్ములమ్మకు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక దర్శనం

జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని జమ్మిచేడులో వెలిసిన జమ్ములమ్మకు శనివారం పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారి విగ్రహాన్ని అభిషేకించి, అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జమ్ములమ్మను దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Similar News
News February 26, 2026
నల్గొండ: ఉగాది పచ్చడికి వేప పూత కరువేనా..!

తెలుగువారి నూతన సంవత్సరం ఉగాదికి వేప పూత ప్రధానం. అయితే, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వేప చెట్లను పట్టి పీడిస్తున్న ‘డైబ్యాక్’ శిలీంధ్ర వ్యాధి కారణంగా చెట్లన్నీ మోడువారుతున్నాయి. ఈ వ్యాధి ప్రభావంతో ఈ ఏడాది ఉగాది పచ్చడికి వేప పూత దొరకడం కష్టంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. పండుగ నాటికి ప్రకృతి సిద్ధమైన ఈ పూత లభించదని భక్తులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News February 26, 2026
NGKL: కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిన కుమ్మెర ఘటన

నాగర్‌కర్నూల్ మండలంలోని కుమ్మెర గ్రామంలో ఇటీవల జరిగిన జాతర సందర్భంగా రజక కుటుంబం పై దాడితో పాటు రెండు నెలల చిన్నారి మృతి సంఘటన కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు రజక కుటుంబంపై దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. వివిధ పార్టీల నాయకులతోపాటు ప్రజాసంఘాల నాయకులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
News February 26, 2026
HYD: మెగా జాబ్ మేళా

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ విత్ ఇంటెలెక్ట్యువల్ డిసెబిలిటీస్ ఆధ్వర్యంలో యూత్4 జాబ్స్ సాకారంతో దివ్యాంగుల కోసం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించనున్నారు. 27 FEB 2026న సికింద్రాబాద్‌లోని NIEPID క్యాంపస్‌లో ఈ మేళా జరగనుంది. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్‌కార్డు, దివ్యాంగ ధ్రువీకరణపత్రం లేదా UDID కార్డు, విద్యార్హత సర్టిఫికేట్లు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకురావాలి.


