News October 8, 2025
జయచంద్రారెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు: TDP

నకిలీ మద్యం విషయంలో TDP నుంచి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడని TDP ట్వీట్ చేసింది. ‘YCP హయాంలో అతని నకిలీ మద్యం దందా బాగా నడిచింది. తిరిగి 15 రోజుల క్రితమే YCP పెద్దల ఆదేశాలతో మళ్ళీ మొదలుపెట్టాడు. ఎక్సైజ్ శాఖ అప్రమత్తతో ఈ నెట్ వర్క్‌ని బయట పెట్టి అరెస్ట్‌లు చేసింది. దీని వెనుక ఉన్న YCP పెద్దలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.’అని పేర్కొంది.
Similar News
News October 8, 2025
బాణాసంచా విక్రయాల అనుమతికి దరఖాస్తు చేసుకోండి: వరంగల్ సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక బాణాసంచా విక్రయాలు, నిల్వ కోసం అనుమతి కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. ఆసక్తి ఉన్నవారు సూచించిన పత్రాలతో కలిపి ఈ నెల 16వ తేదీలోపు సంబంధిత డీసీపీ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని పేర్కొన్నారు.
News October 8, 2025
మహబూబ్‌నగర్‌లో డీఐజీ చౌహన్ తనిఖీలు

మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని జోగులాంబ జోన్ డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు. డీపీఓ, స్పెషల్ బ్రాంచ్, డీసీబీ, ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ తదితర విభాగాలను పరిశీలించారు. వివిధ విభాగాల పనితీరు, రికార్డు నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణ, పారదర్శకత వంటి అంశాలపై సమీక్షించారు. కార్యక్రమంలో ఎస్పీ డి. జానకి, అదనపు ఎస్పీలు ఎన్.బి. రత్నం, సురేష్ కుమార్ పాల్గొన్నారు.
News October 8, 2025
రైతులకు ఇబ్బందులేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి: కలెక్టర్

రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. బుధవారం ఆర్డీఓ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లపై జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేసి, నిబంధనల ప్రకారం కొనుగోళ్లు చేపట్టాలన్నారు. జిల్లాలో 110 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, 312 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.