News September 6, 2025

జయజయధ్వానాల నడుమ గంగమ్మ ఒడికి గణపయ్య

image

ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం మొదలైంది. గణపతి బప్పా మోరియా జయజయధ్వానాల నడుమ క్రేన్ సాయంతో గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలు గణపయ్య నామ స్మరణతో దద్దరిల్లుతున్నాయి. గణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Similar News

News September 6, 2025

HYD: రేపు ఉ.10 గం.కు రోడ్లు ఓపెన్!

image

రేపు ఉ.10 గంటలలోపు హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల రహదారులపై జనరల్ ట్రాఫిక్ అనుమతించడానికి ప్రయత్నిస్తామని HYD సీపీ ఆనంద్ తెలిపారు. అలాగే నెక్లెస్ రోడ్‌‌పై విగ్రహాలు ఉన్న వాహనాలను నాలుగు వరుసలలో ఉంచి, రేపు రాత్రి వరకు నిమజ్జనం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. HYD వ్యాప్తంగా 29,000 మంది పోలీసులు నిర్విరామంగా కృషి చేస్తున్నారన్నారు.

News September 6, 2025

HYD: రూ.2.32 కోట్లకు లడ్డూ.. ఆ డబ్బుతో ఏం చేస్తారో తెలుసా?

image

బండ్లగూడ రిచ్ మండ్ విలాస్‌లో గణేశ్ లడ్డూ రికార్డు సృష్టించింది. 10 కిలోల లడ్డూ 2025లో రూ.2.32 కోట్లు ధర సాధించింది. ఇది 2024లో రూ.1.87 కోట్ల కంటే రూ.45 లక్షలు ఎక్కువ. గతంలో 2022లో రూ.60.48 లక్షలు, 2023లో రూ.1.26 కోట్లు, 2024లో రూ.1.87 కోట్లు పలికింది. ఈ మొత్తాన్ని ఆర్వి దివ్య చారిటబుల్ ట్రస్ట్‌కు అందజేస్తారు. దీని ద్వారా 42కిపైగా ఎన్జీఓలు వృద్ధుల సంరక్షణ, మహిళల ఆరోగ్యం, విద్య, వైద్యం అందిస్తారు.

News September 6, 2025

HYD: అప్రమత్తమైన అగ్నిమాపక, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు

image

గణేశ్ నిమజ్జనాలు సురక్షితంగా జరిగేలా తెలంగాణ అగ్నిమాపక, ఎస్డీఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు అప్రమత్తమయ్యాయి. ప్రధాన సరస్సులు, బేబీ పాండ్స్ వద్ద ఫైర్ టెండర్లు, క్రేన్లు, బోట్లు, శిక్షణ పొందిన ఈతగాళ్లతో బృందాలను సిద్ధంగా ఉంచారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీతో కలిసి ఈ బృందాలు పనిచేస్తున్నాయి. నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.