News September 6, 2025
జయజయధ్వానాల నడుమ గంగమ్మ ఒడికి గణపయ్య

ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం మొదలైంది. గణపతి బప్పా మోరియా జయజయధ్వానాల నడుమ క్రేన్ సాయంతో గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలు గణపయ్య నామ స్మరణతో దద్దరిల్లుతున్నాయి. గణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
Similar News
News September 6, 2025
రైతాంగ సమస్యలపై 9న అన్నదాత పోరు: వైసీపీ

వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే.రాజు ఆధ్వర్యంలో శనివారం అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరించారు. యూరియా కొరత, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం రైతులను బిచ్చగాళ్లుగా మార్చిందని ఆయన విమర్శించారు. ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరు నిర్వహించనున్నట్టు తెలిపారు.
News September 6, 2025
ఎం.అలమండ: పాము కాటుతో యువకుడి మృతి

దేవరాపల్లి మండలం ఎం.అలమండ గ్రామానికి చెందిన బుడ్డ శ్రీను(28) పాము కాటుకి గురై మృతి చెందాడు. శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి బహిర్భూమికి వెళ్లాడు. ఆ సమయంలో విషసర్పం ఎడమకాలిపై కాటేసింది. వెంటనే కె.కోటపాడు సీహెచ్సీకి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
News September 6, 2025
లిక్కర్ కేసు: ముగ్గురు నిందితులకు బెయిల్

AP: లిక్కర్ కేసు నిందితులైన ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. విజయవాడ ఏసీబీ కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరూ రూ.లక్ష చొప్పున 2 ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, ముగ్గురూ పాస్‌పోర్టు వివరాలు అందించాలంది. ఇప్పటికే ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఓటు వేసేందుకు ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ రాగా, ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు.