News February 7, 2025
జయపురం గ్రామంలో విచారణ నిర్వహించిన ఎస్సై
నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామంలో నిన్న దళిత యువకులను గుడిలోకి రానివ్వకపోవడంతో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో దళిత సంఘాల నాయకులు ఇచ్చిన ఫిర్యాదు చేసిన మేరకు స్థానిక ఎస్ఐ సురేశ్ గ్రామంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రజలను ఘటన గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News February 7, 2025
Stock Markets: ఫ్లాటుగా సూచీలు.. లాభాల్లో మెటల్ స్టాక్స్
స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, RBI వడ్డీరేట్ల సమీక్ష నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిఫ్టీ 23,586 (-17), సెన్సెక్స్ 78,035 (-22) వద్ద చలిస్తున్నాయి. FMCG, IT, O&G, మీడియా సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, మెటల్ స్టాక్స్ పుంజుకున్నాయి. ఎయిర్‌టెల్, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, JSW స్టీల్, అల్ట్రాటెక్ సెమ్ టాప్ గెయినర్స్.
News February 7, 2025
నేడు వడ్డీ రేట్లు ప్రకటించనున్న ఆర్బీఐ
ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల్ని కాసేపట్లో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించనున్నారు. కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెషన్ ఆరంభ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 87.80 పాయింట్లు పెరిగి 78,145.96 వద్ద ఉంది. నిఫ్టీ 35.05 పాయింట్లు లాభపడి 23,638 వద్ద ట్రేడయింది.
News February 7, 2025
NZB: ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోండి: స్రవంతి
నిజామాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆర్ఆర్బీ, ఎస్సెస్సీ, బ్యాంకింగ్ ఉద్యోగ పరీక్షలకు, ఫౌండేషన్ కోర్సులకు ఉచిత కోచింగ్ కోసం ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారిణి స్రవంతి కోరారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 9నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈనెల 12నుంచి 14వరకు ఉంటుందన్నారు. వివరాలకు 86390 02255ను సంప్రదించాలన్నారు.