News December 27, 2025

జరీబు భూములపై పరిశీలనకు ఆదేశం

image

AP: రాజధాని ప్రాంతంలోని జరీబు(3 పంటలు పండేవి) భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల వర్గీకరణపై పున:పరిశీలనకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. జరీబు, నాన్ జరీబు భూములు ఇచ్చినవారికి ప్లాట్లు ఇస్తున్నామని, ఈ ప్రక్రియ 45రోజుల్లో పూర్తి చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.

Similar News

News December 28, 2025

ధనుర్మాసం: పదమూడో రోజు కీర్తన

image

‘శుక్రుడు ఉదయించి, బృహస్పతి అస్తమించాడు. పక్షులు కిలకిలరావాలతో ఆకాశంలోకి ఎగిశాయి. తెల్లవారింది లెమ్ము. బకాసురుని సంహరించిన కృష్ణుడిని, రావణుని అంతం చేసిన రాముడిని కీర్తిస్తూ, వారిని సేవించుకోవడానికి ఇది మంచి సమయం. వికసించిన తామర కన్నులు గల ఓ సుందరీ! నీ కపట నిద్ర వీడి, మాతో కలిసి పవిత్ర స్నానమాడి వ్రతంలో పాల్గొను. నీ రాకతో మనందరికీ శుభం కలుగుతుంది’’ అని గోపికలు ప్రార్థిస్తున్నారు. <<-se>>#DHANURMASAM<<>>

News December 28, 2025

వాళ్లకు దేశం కన్నా మతమే ఎక్కువ: అస్సాం CM

image

బంగ్లాదేశీయులకు దేశం కన్నా మతమే ఎక్కువని అస్సాం CM హిమంత బిశ్వ శర్మ అన్నారు. ‘ఇప్పుడు బంగ్లాదేశ్‌లో <<18624742>>దీపూ చంద్రదాస్<<>> పరిస్థితి చూస్తున్నాం. 20 ఏళ్ల తర్వాత అస్సాంలో ఇలానే జరిగే ప్రమాదం ఉంది. 2027 నాటికి అస్సాంలో బంగ్లా సంతతికి చెందిన మియా ముస్లింలు 40% ఉంటారు’ అని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ‘నాగరికత పోరాటం’గా హిమంత అభివర్ణించారు.

News December 28, 2025

ధోనీతో ఆడటం నా అదృష్టం: డుప్లెసిస్

image

CSKలో MS ధోనీ, స్టీఫెన్ ఫ్లేమింగ్ వంటి గొప్ప ప్లేయర్ల ఆధ్వర్యంలో ఆడటం తన అదృష్టమని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నారు. సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. CSKలో పదేళ్లు, JSKలో మూడేళ్లు ఆడానని, ఇదో గొప్ప ఫ్రాంచైజీ అని అన్నారు. ఇటీవల IPLకు డుప్లెసిస్ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం సౌతాఫ్రికా T20 లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నారు.