News November 20, 2025

జర్నలిస్టులకు క్రికెట్ పోటీలు: ములుగు ఎస్పీ

image

జిల్లాలోని జర్నలిస్టులకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ శబరిష్ తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఒక్క టీం చొప్పున వివరాలను అందజేయాలని ఎస్పీ సూచించారు. జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో పోటీలు నిర్వహించబడతాయని అన్నారు. వివరాలకు స్థానిక ఎస్హెచ్ఓలను సంప్రదించాలని ఎస్పీ పేర్కొన్నారు.

Similar News

News November 25, 2025

మహిళా సాధికారతలో జిల్లా ముందడుగు: కామారెడ్డి కలెక్టర్

image

మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా కామారెడ్డి జిల్లా ముందడుగుగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం గాంధారిలో ఆయన స్వయం సహాయక సంఘాలకు రూ.3.78 కోట్ల చెక్కులను ఎమ్మెల్యేతో కలిసి అందించారు. జిల్లాలో 14,359 సంఘాలకు రూ.789.13 కోట్లు ఆర్థిక లక్ష్యం కాగా, ఇప్పటివరకు 6,971 సంఘాలకు రూ.558.41 కోట్లు విడుదలయ్యాయని కలెక్టర్ తెలిపారు.

News November 25, 2025

కామారెడ్డి కలెక్టరేట్‌లో మాదక ద్రవ్యాల నిరోధకంపై సమావేశం

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా అధికారులతో మాదకద్రవ్యాల నిరోధకంపై సమన్వయ సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు మాదకద్రవ్యాల నిరోధకంపై అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతపరచాలని, జిల్లాలో డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ల నిర్వహణపై చర్చించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,అడిషనల్ కలెక్టర్లు, వైద్య, విద్యా, పోలీసు, ఎక్సైజ్, రవాణా, ఫారెస్ట్ అధికారులు ఉన్నారు.

News November 25, 2025

కామారెడ్డి జిల్లాలో కలెక్టర్, ఎస్పీ సంయుక్త సమీక్ష

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్ అశిష్ సాంగ్వన్, జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఆధ్వర్యంలో మంగళవారం కీలక విభాగాలపై సమీక్ష సమావేశం జరిగింది. పౌర హక్కుల రక్షణ చట్టం-1955, SC/ST అట్రాసిటీ చట్టాల అమలు, పెండింగ్ కేసుల పురోగతిపై అధికారులు వివరాలు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేకంగా చర్చ జరగగా, అవగాహన కార్యక్రమాలు, సంయుక్త దళాల తనిఖీలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.