News February 28, 2026
జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పొడిగింపు: DPRO

ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు డీపీఆర్వో సంపత్ కుమార్ తెలిపారు. పాత కార్డుల గడువు ఈనెల 28తో ముగియనున్న నేపథ్యంలో, జర్నలిస్టుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. కొత్త కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యే వరకు పాత కార్డులే చెల్లుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
Similar News
News March 7, 2026
ములుగు: అనారోగ్యంతో జవాన్ మృతి

ములుగు మండలం అబ్బాపూర్ గ్రామ పరిధిలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గోనె రమేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడు సీఐఎఫ్‌ఎస్‌లో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమేశ్ మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రమేశ్ మృతి పట్ల బాల్యమిత్రులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
News March 7, 2026
స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా: HNK డీఈవో

ఈనెల 14వ తేదీ నుంచి పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లను క్యూఆర్ కోడ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్ గౌడ్ తెలిపారు. అలాగే క్యూఆర్ కోడ్ తల్లిదండ్రులు స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా సూచిస్తుందని ఆయన వివరించారు. నిబంధనల మేరకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సమయానికి ముందే చేరుకోవాలని చెప్పారు.
News March 7, 2026
అమలాపురం: స్టాప్.. వాష్ అండ్ గో

అర్ధరాత్రి, తెల్లవారుజామున జరిగే రహదారి ప్రమాదాలను అడ్డుకునేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం శనివారం వినూత్నంగా స్పందించింది. SP ఆదేశాలతో జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాలను నిలిపి డ్రైవర్లతో ముఖం కడిగిస్తున్నారు. నిద్రమత్తు వల్ల తలెత్తే ముప్పును తప్పించేందుకు లారీలు, బస్సులు, కార్ల డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్నారు. పోలీసుల ఈ చొరవతో ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.


