News January 14, 2026
జర్నలిస్టుల అరెస్టును ఖండిస్తున్నా: జగన్

హైదరాబాద్‌లో NTV జర్నలిస్టుల <<18856335>>అరెస్టును<<>> YCP అధినేత జగన్ ఖండించారు. ‘పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై ఇది ప్రత్యక్ష దాడి. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి, నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం శోచనీయం. జర్నలిస్టులు ఉగ్రవాదులు కాదు. ఇలాంటి చర్యలు మీడియాలో భయాన్ని సృష్టిస్తాయి. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News February 15, 2026
చెరకు పంట నరికేటప్పుడు ఇలా చేస్తే మేలు

చెరకు పంటను నరికేటప్పుడు గడలను భూమట్టానికే నరకాలి. కొన్ని ప్రాంతాల్లో భూమి పైన రెండు, మూడు అంగుళాలు వదిలేసి నరుకుతుంటారు. ఇలా చేయడం వల్ల రైతుకు నష్టం. మొదలు కణుపులలో పంచదార పాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇటు పంచదార అటు బెల్లం దిగుబడులు కూడా తగ్గుతాయి. చెరకును భూమట్టానికి నరికి ఖాళీ చేసిన తోటల్లో వేళ్లు లోతుగా చొచ్చుకెళ్లి తోట బలంగా పెరిగి వర్షాకాలంలో వచ్చే ఈదురు గాలులు, వర్షాలను కూడా తట్టుకుంటుంది.
News February 15, 2026
పరమ భక్తుడు ‘సిరియాళుడు’

సిరియాళుడు ప్రతిరోజు ఓ శివ భక్తుడికి భోజనం పెట్టిన తర్వాతే తను తినేవాడు. ఆయన భక్తిని పరీక్షించడానికి శివుడు ఓ వృద్ధుడి రూపంలో వచ్చి సిరియాళుడి ఏకైక కుమారుడిని వండి వడ్డించమని అడుగుతాడు. భక్తి కోసం సిరియాళుడు ఆ కఠినమైన పనికి అంగీకరిస్తాడు. ఆ దంపతుల నిశ్చల భక్తికి మెచ్చిన పరమశివుడు, వారి కుమారుడిని తిరిగి బ్రతికించి, ఆ కుటుంబం మొత్తానికి మోక్షాన్ని ప్రసాదించాడు. నిస్వార్థ భక్తికి ఆయన నిదర్శనం.
News February 15, 2026
నేషనల్ ఆయుష్ మిషన్‌లో ఉద్యోగాలు

నేషనల్ ఆయుష్ మిషన్(<


