News November 7, 2025
జర్మనీలో ఉద్యోగ అవకాశాలు: జితేంద్రబాబు

జర్మనీ నిర్మాణ రంగంలో రెండేళ్ల కాంట్రాక్టు పద్ధతిపై ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జితేంద్రబాబు గురువారం తెలిపారు. ఐటీఐ, డిప్లమా అర్హతతో పాటు ఎలక్ట్రీషియన్ వర్క్‌లో రెండేళ్ల అనుభవం ఉన్న 18-30 ఏళ్ల పురుషులు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/user-registration?page=program-registration వెబ్ సైట్‌లో వివరాలు నమోదు చేయాలన్నారు.
Similar News
News November 7, 2025
సూపర్ నేపియర్ గడ్డిని ఎలా పెంచాలి?

పశుగ్రాసం కొరతను తగ్గించి, పాడి పశువులకు ఎక్కువ పోషకాలను అందించే గడ్డి సూపర్ నేపియర్. దీన్ని చౌడు నేలలు మినహా ఆరుతడి కలిగిన అన్ని రకాల నేలల్లో పెంచవచ్చు. దీని సాగుకు ముందు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల సూపర్ ఫాస్పేట్, 20kgల నత్రజని, 10kgల పొటాష్ వేయాలి. భూమిని మెత్తగా దున్ని, ప్రతీ 3 అడుగులకొక బోదెను ఏర్పాటు చేసి, ఎకరాకు 10 వేల కాండపు కణుపులు లేదా వేరు పిలకలు నాటుకోవాలి.
News November 7, 2025
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 50 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

పుణేలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేహు రోడ్‌లో 50 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్‌తో పాటు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://munitionsindia.in/career/
News November 7, 2025
ఆనందపురం: అనుమానాస్పద స్థితిలో కార్పెంటర్ మృతి

ఆనందపురం మండలం నేలతేరు గ్రామానికి చెందిన కడియం కనకరాజు (53) గురువారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కార్పెంటర్‌గా పనిచేస్తున్న అతను ఆనందపురం గ్రామంలోని కోళ్ల ఫారం షెడ్ నిర్మాణానికి వెళ్లగా అక్కడ మృతి చెందాడు. మొదట సహజ మరణంగా భావించిన కుటుంబ సభ్యులు తర్వాత అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


