News January 13, 2026

జలదాత కాటన్ పుణ్యమే.. నేటి గోదావరి లోగిళ్ల స్వర్ణమయం!

image

గోదావరి జిల్లాలలో సంక్రాంతి పండుగ వైబ్ ఓ రేంజ్‌లో ఉంది. అయితే ఈసమయంలో మనం ఓమహానుభావుడిని తప్పకుండా గుర్తుచేసుకోవాలి. 1833లో ‘డొక్కల కరువు’తో గోదావరి జిల్లాలు అల్లాడాయి. ఆకలి కోరల్లో చిక్కుకున్న ఈప్రాంతాన్ని చూసి చలించిన అపరభగీరథుడు ‘సర్ ఆర్థర్ కాటన్’..1847లో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టి గోదావరి జిల్లాలను ‘అన్నపూర్ణ’గా మార్చింది. కాటన్ దొర సంకల్పమే నేటి సంక్రాంతి సిరిసంపదలకు మూలం.

Similar News

News February 21, 2026

శ్రీకాకుళం: మహిళ పొట్ట నుంచి 3.3 కిలోల కణితి తొలగింపు

image

కడుపు నొప్పితో బాధపడుతూ శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి శనివారం వచ్చింది. పరీక్షించిన వైద్యులు కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం శస్త్ర చికిత్స చేసి 3.3 కిలోల కణితిని ఆ మహిళ పొట్ట నుంచి బయటకు తీశారు. పేషంట్ పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారని, అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా చేశామన్నారు.

News February 21, 2026

జగిత్యాల: ఉపాధ్యాయుల సర్వీసు వివరాల పరిశీలన

image

జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులరైజేషన్, ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 26 నుంచి 28 వరకు, అలాగే మార్చి 2న సర్వీసు వివరాల పరిశీలన నిర్వహించనున్నట్లు డీఈవో రాము తెలిపారు. జగిత్యాల (అర్బన్) ఎంఆర్సీలో ఈ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. జాబితాలో పేర్లు ఉన్న ఉపాధ్యాయులు తమ ఒరిజినల్ సర్వీస్ రిజిస్టర్, ధ్రువపత్రాలు, నిర్ణీత ప్రొఫార్మాలతో తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.

News February 21, 2026

మదనపల్లె మృగాడు మృతి.. CM ఏమన్నారంటే?

image

AP: మదనపల్లె హత్యాచార నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్యపై CM చంద్రబాబు వినుకొండ సభలో స్పందించారు. ‘మదనపల్లెలో గంజాయి సేవించి మానవ మృగంగా ప్రవర్తించాడు. ఆడబిడ్డల జోలికొస్తే అది వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించా. చట్టం కఠినంగా వ్యవహరిస్తుందన్న భయంతో అతను ప్రాణాలు తీసుకున్నాడు’ అని చెప్పారు. ఘటన అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకోగా మృతదేహాన్ని తీసుకోవడానికి కుటుంబీకులు ముందుకు రాని విషయం తెలిసిందే.