News April 13, 2025
జలపాతంలో పూర్ణామార్కెట్ యువకులు గల్లంతు

అనకాపల్లి జిల్లా సరిహద్దులోని సరియా జలపాతంలో ఆదివారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. విశాఖ పూర్ణ మార్కెట్‌కు చెందిన ఆరుగురు స్నేహితులు జలపాతం చూసేందుకు రాగా, వారిలో ఇద్దరు జలపాతంలో గల్లంతయ్యారు. దేవరాపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ఇద్దరు యువకులు వెళ్ళగా.. ఘటనా ప్రదేశం అనంతగిరి పీఎస్ లిమిట్స్‌లో ఉందని తెలుసుకుని అక్కడ ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 15, 2025
విశాఖ: లారీ ఢీకొని మహిళ మృతి

విశాఖలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. టూటౌన్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావణ్య బస్సు కోసం సహోద్యోగి ద్విచక్రవాహనంపై జైలురోడ్డు నుంచి జగదాంబ జంక్షన్‌కి వెళ్తున్నారు. ఆ సమయంలో ఆటు నుంచి వస్తున్న జీవీఎంసీ గార్బేజ్ లారీ వారిని వెనుక నుంచి ఢీకొట్టింది. ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న లావణ్య కుడివైపు పడిపోవడంతో ఆమె తలపై నుంచి లారీ వెళ్లింది.
News April 15, 2025
పక్క పక్కనే షెడ్డులు ఉండటంతో ప్రాణనష్టం: అనకాపల్లి ఎస్పీ

కైలాసపట్నం బాణసంచా కేంద్రంలో క్రాకర్స్ తయారీకి కెమికల్స్‌ను గ్రైండర్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. కోటవురట్ల పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. రెండో నంబర్ షెడ్లలో పేలుడు జరిగి వ్యాపించిన మంటలు దగ్గరలో ఉన్న ఒకటో నంబర్ షెడ్‌కు వ్యాప్తి చెందినట్లు తెలిపారు. పక్క పక్కనే షెడ్‌లు ఉండటంవల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందన్నారు.
News April 15, 2025
సింహాచలం చందనోత్సంపై సమీక్షించనున్న మంత్రి

దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం విశాఖ రానున్నారు. ఈరోజు రాత్రి 10:45కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని ఓ హోటల్‌లో బస చేస్తారు. బుధవారం సింహాచలం దేవాలయానికి వెళ్లి చందనోత్సవ పనులపై అధికారులతో కలిసి సమీక్ష చేస్తారు. సాయంత్రం సింహాచలం నుంచి విశాఖ ఎయిర్పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.