News October 26, 2025

జలమండలి ప్రాజెక్ట్.. 61 సర్వీస్ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి

image

జలమండలి పరిధిలో రిజర్వాయర్లను పూర్తి చేయడం కోసం కసరత్తు చేస్తున్నట్లు HMWSSB అధికారులు తెలిపారు. ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్డు వరకు 71 రిజర్వాయర్లలో ఇప్పటికే, 61 పూర్తి చేసి, మిగిలినవి వివిధ దశలో ఉన్నట్లు ప్రత్యేక నోటీసు విడుదల చేశారు. త్వరలోనే వాటిని సైతం పూర్తి చేసి, పూర్తిస్థాయిలో నీటి సరఫరా కోసం చర్యలు చేపడతామన్నారు.

Similar News

News October 26, 2025

అలీబాబా దొంగల ముఠాలా రేవంత్ పాలన తయారైంది: KTR

image

TG: రాష్ట్రంలో పరిపాలన రౌడీ షీటర్ల పాలన అయ్యిందని మాజీమంత్రి KTR విమర్శించారు. తెలంగాణ భవన్‌లో హోటల్స్ కార్మిక యూనియన్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ‘మంత్రి OSD తుపాకీతో బెదిరించారని మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లారు. మంత్రి బిడ్డ బయటకొచ్చి తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, రోహిన్ రెడ్డి అన్నారు. మంత్రి భర్త తుపాకీ ఇచ్చారని పోలీసులు అంటున్నారు. అలీబాబా దొంగల ముఠాలా పాలన తయారైంది’ అని ఎద్దేవా చేశారు.

News October 26, 2025

పర్యాటక ప్రాంతాలకు రావద్దు: డీఎస్పీ సహబాజ్ అహమ్మద్

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో టూరిస్టులు ఎవ్వరూ పర్యాటక ప్రాంతాలకు రావద్దని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని పాడేరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సహబాజ్ అహమద్ కోరారు. తుఫాన్ ప్రభావంతో పాడేరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి, తారాబు, కిటిక, సరియా జలపాతాలు, డుంబ్రిగుడ చాపరాయికి ప్రవేశం నిషేధమన్నారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకూ అందరూ సహకరించాలని డీఎస్పీ కోరారు.

News October 26, 2025

శ్రీరామ నామ జప ఫలితాలు

image

నిరంతరం శ్రీరామ నామ జపం చేయడం వలన మనస్సుకు శాంతి లభిస్తుంది. పాపాలు, దోషాలు నశించి, చిత్తశుద్ధి కలుగుతుంది. దీని ద్వారా హృదయంలో భగవంతుని పట్ల భక్తి పెంపొందుతుంది. నామ సంకీర్తన వలన దుఃఖాలు తొలగి, జీవితంలో ఆనందం నిండుతుంది. అష్టైశ్వర్యాలు, మోక్షం వంటి ఫలాలను కూడా ఈ నామ జపం ప్రసాదిస్తుంది. సర్వవిధాల శ్రేయస్సును, అంతిమంగా పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి నామ జపం ఉత్తమమైన మార్గం. <<-se>>#Bakthi<<>>