News March 31, 2025
జలుమూరు దేవాలయ ఘటనపై SP మహేశ్వర్ రెడ్డి పరిశీలన

జలుమూరు మండలంలో పలు దేవాలయాలలో ఉగాది పర్వదినాన అన్యమత ప్రచారాలు నిర్వహించారన్న ఆరోపణల నేపథ్యంలో ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ దేవాలయాలలో వివిధ అన్యమత ప్రచారకులుపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు గ్రామాలలో జరిగిన సంఘటనలపై ఆయన ఆరా తీశారు. ఆయనతోపాటు క్రైమ్ ASP శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Similar News
News April 1, 2025
శ్రీకాకుళం: ఏపీ పీజీఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్

రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పీజీఈసెట్ నోటిఫికేషన్ మార్చి 28వ తేదీన విడుదలైంది. ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దాదాపు 153 పీజీ కోర్సులకు సంబంధించి జూన్ 6 నుంచి 8 వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు https://cets .apsche.ap.gov.inలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
News April 1, 2025
SKLM: హెడ్ కానిస్టేబుల్‌ను సత్కరించిన జిల్లా ఎస్పీ

శ్రీకాకుళం జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో సుమారు 41సంవత్సరాలు పాటు హెడ్ కానిస్టేబుల్‌గా పని చేసిన పి. కృష్ణమూర్తి మార్చి 31న (సోమవారం) ఉద్యోగ విరమణ చెందారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కృష్ణమూర్తికి శాలువా, పూల దండతో సత్కరించారు. అనంతరం జ్ఞాపికను ప్రధానం చేసి పోలీస్ అధికారుల సమక్షంలో ఆత్మీయ వీడ్కోలు పలికారు.
News April 1, 2025
వజ్రపుకొత్తూరు: గల్లంతైన ఇద్దరు మత్స్యకారులు మృతి

సముద్రంలో గల్లంతైన ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లుపేట గ్రామానికి చెందిన బొంగు ధనరాజు (35), వంక కృష్ణారావు (40) చనిపోయారు. మృతులకు భార్యాపిల్లలు ఉన్నారు. నలుగురు మత్స్యకారులు వేటకు వెళ్లగా బోటు తిరగబడి ప్రమాదం జరిగింది. ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మత్స్యకారుల మృతిలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.