News January 23, 2025

జలుమూరు: బ్యానర్‌లో ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంపై ఆక్షేపణ

image

జలుమూరు మండలం లింగాలవసలో నిర్వహించిన పశు వైద్య శిబిరం కార్యక్రమంలో బ్యానర్లపై ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఫొటో ఎందుకు ముద్రించలేదంటూ టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఇది ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడమేనని ఫైర్ అయ్యారు. అయితే బ్యానర్లు డైరెక్టరేట్ నుంచి వచ్చాయని స్థానికంగా తయారు చేసి ఉంటే ఎమ్మెల్యే ఫొటో ముద్రించే వాళ్లమని ఏడి రాజగోపాల్ రావు వివరణ ఇచ్చారు.

Similar News

News December 19, 2025

శ్రీకాకుళం: ఒకే కళాశాల నుంచి 25 మందికి అగ్నివీర్ ఉద్యోగాలు

image

విశాఖ, కాకినాడలో ఆగస్టు నెలలో జరిగిన అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌లో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల NCC విద్యార్థులు సత్తాచాటారు. ఈ అగ్నివీరు రిక్రూట్‌మెంట్‌లో 25 మంది ఉద్యోగాలు సాధించినట్లు ఇటీవల కాల్ లెటర్స్ వచ్చాయని ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్, NCC అధికారి పోలినాయుడు తెలిపారు. వీరిని శుక్రవారం అభినందించారు. NCCలో నైపుణ్య శిక్షణ, క్రమశిక్షణ, దేహదారుఢ్య శిక్షణ విద్యార్థులకు ఉపయోగపడిందన్నారు.

News December 19, 2025

ఎచ్చెర్ల: ఫలితాలు విడుదల

image

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పోస్టు గ్రాడ్యుయేషన్ 2వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://brau.edu.inలో పొందుపరిచినట్లు తెలిపారు. మొత్తం 178 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా 85 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు.

News December 19, 2025

నరసన్నపేట: విద్యార్థులతో కలిసి పాఠాలు విన్న DEO

image

నరసన్నపేటపేట మండలం సత్యవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఉదయం DEO రవిబాబు సందర్శించారు. అనంతరం ఉపాద్యాయులు చెప్పిన పాఠాలను విద్యార్థులతో కలిసి విన్నారు. విద్యాబోధన తీరును పరిశీలించిన ఆయన, పాఠశాలలోని పలు రికార్డులు పరిశీలించారు. భోజనం నాణ్యత, రుచి ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.