News March 4, 2025

జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు: కుప్పం DSP

image

కుప్పం నియోజకవర్గ పరిధిలో జల్లికట్టు, ఎద్దుల పండుగ (మైలారు)ను నిషేధించినట్లు డీఎస్పీ పార్థసారధి స్పష్టం చేశారు. ఎక్కడైనా జల్లికట్టు, ఎద్దుల పండగను నిర్వహిస్తే వారు జంతు సంరక్షణ చట్టం క్రింద శిక్షార్హులన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని DSP హెచ్చరించారు.  

Similar News

News February 16, 2026

చిత్తూరు SP పరిష్కార వేధికకు 36 అర్జీలు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో SP తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. కాగా బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 36 ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 6, భూతగాదాల ఫిర్యాదులు 17 అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

చిత్తూరు: కళ్లు లేవు సార్.. పెన్షన్ ఇప్పించండి!

image

జీడీనెల్లూరు గ్రామానికి చెందిన మాళవిక తన తండ్రితో కలిసి చిత్తూరులో జరిగిన గ్రీవెన్స్ డేకు హాజరైంది. తనకు రెండు కళ్లు లేవని.. పెన్షన్ ఇప్పించాలని జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది. గ్రామ సచివాలయ అధికారులను ఆశ్రయిస్తే.. రాదన్నారని చెప్పింది. అర్హతను పరిశీలించి పెన్షన్ మంజూరు చేయడానికి నివేదిక ఇవ్వాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.