News February 25, 2026

జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప‌నుల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి: కలెక్టర్

image

జ‌ల్ జీవ‌న్ మిష‌న్ (జేజేఎం) ప‌నుల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టి త్వ‌రిత‌గ‌తిన పూర్త‌య్యేలా చూసి ప‌థ‌కం ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేలా కృషి చేయాల‌ని కలెక్టర్ ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో జిల్లా జ‌ల‌, పారిశుద్ధ్య మిషన్ స‌మావేశం నిర్వహించారు. నీటి నాణ్యత, పర్యవేక్షణ, నిఘా త‌దిత‌రాల‌పై చ‌ర్చించారు. 100 శాతం క‌నెక్ష‌న్లు క‌ల్పించేందుకు డీపీఓకు ఆదేశాలిచ్చారు.

Similar News

News February 25, 2026

కామారెడ్డి: ఇంటర్, పదో తరగతి పరీక్షలు.. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

image

కామారెడ్డి జిల్లాలో ఇంటర్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీ ఏర్పట్లు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలు, సలహాలు సూచనలకు 9866143782, 9948164514 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలన్నారు.

News February 25, 2026

ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులకు పదోన్నతులు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు ఇచ్చింది. నలుగురు డిప్యూటీ సీఈఓలు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పదోన్నతి పొందారు. హనుమకొండ జడ్పీ డిప్యూటీ సీఈఓ బి.రవి, జనగామ డీఆర్ఓ ఎన్.వసంత, జనగామ జడ్పీ డిప్యూటీ సీఈఓ డి.సరిత, హసన్‌పర్తి ఈటీసీ ప్రిన్సిపల్ కౌసల్యదేవి ఈ జాబితాలో ఉన్నారు. అదే విధంగా ఐదుగురు ఎంపీడీఓలు డిప్యూటీ సీఈఓలుగా ప్రమోషన్ పొందారు.

News February 25, 2026

విశాఖ: 601.4 ఎకరాలు కేటాయించడానికి నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం

image

గూగుల్ ఏర్పాటు చేయనున్న వేయి మెగావాట్ల కృత్రిమ మేధస్సు డేటా కేంద్రానికి విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో 601.4 ఎకరాలు కేటాయించడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో అడవివరం, ముడసర్లోవలో దేవదాయ శాఖ భూములను APIIC ద్వారా 30 ఏళ్ల లీజుకు ఇవ్వనున్నారు. తర్లువాడలో రూ.2,387.81 కోట్లతో సెమి కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు 30 ఎకరాలు కేటాయించారు. ఈ ప్రాజెక్టుతో వెయ్యి మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది.