News October 22, 2024

జల వనరుల నిర్వహణలో ఉత్తమ జిల్లాగా విశాఖ

image

జల వనరుల నిర్వహణలో ఉత్తమ జిల్లాగా విశాఖ ఎంపికైంది. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం ఢిల్లీలో భార‌త రాష్ట్రప‌తి చేతుల మీదుగా జాతీయ నీటి అవార్డును విశాఖ కలెక్ట‌ర్ ఎం.ఎన్.హ‌రేంధిర ప్ర‌సాద్ అందుకున్నారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు.

Similar News

News November 17, 2024

విశాఖ: ‘గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి చర్యలు’

image

గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఉత్తరాంధ్రలో 8 జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులతో విశాఖ పోలీస్ రేంజ్ కార్యాలయంలో డీఐజీ గోపీనాథ్ జెట్టి సమావేశం నిర్వహించారు. గంజాయి సాగుకు ఆర్థికంగా మద్దతిస్తున్న వ్యాపారులపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

News November 17, 2024

గిరిజన విద్యార్థులు ఐఏఎస్ అధికారులుగా ఎదగాలి: కలెక్టర్

image

గిరిజన విద్యార్థులు ఐఏఎస్ అధికారులుగా ఎదగాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. శనివారం పాడేరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో లోచలపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల, తలారిసింగి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులతో కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారని, వారికి సహాయకారిగా ఉండాలని సూచించారు.

News November 16, 2024

విశాఖ: రూ.65 కోట్ల విలువ కలిగిన భూమి స్వాధీనం

image

సీతమ్మధార ప్రాంతంలో ఆక్రమణదారుల ఆధీనంలో ఉన్న రూ.65 కోట్ల విలువ గల 10 ఎకరాల భూమిని సింహాచలం దేవస్థానం అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ 10 ఎకరాల భూమితో పాటు మరో 4,460 చదరపు గజాల భూమికి సంబంధించి ఆక్రమణదారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో ఈఓ త్రినాథరావు, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి దేవస్థానానికి చెందిన భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.