News February 5, 2025
జవహర్‌నగర్: స్ట్రాబెర్రీల రూపంలో డ్రగ్స్ సరఫరా.!

డ్రగ్స్‌ను రకరకాల రూపాలతో కొందరు నేరస్థులు తయారు చేసి సరఫరా చేస్తుండగా ఇప్పుడు సరికొత్త రూపంలో బొమ్మల రూపంలో తయారు చేసి స్కూల్స్ వద్ద అమ్ముతున్నట్లు ఒక వాయిస్ మెసేజ్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంతవరకు చాక్లెట్ల రూపంలో సరఫరా చేస్తుండగా ప్రస్తుతం కొందరు నేరస్థులు చిన్న బొమ్మల రూపంలో తయారుచేసి స్కూల్స్ వద్ద అమ్ముతున్నట్లు ఒక ఫొటోతో సహా చక్కర్లు కొడుతోంది.
Similar News
News March 14, 2025
నాని కేరాఫ్ నయా టాలెంట్

నాని హీరోగా తన మార్కు చాటుతూనే నిర్మాతగా అవతారమెత్తారు. కొత్త వారికి అవకాశమిస్తూ సూపర్ హిట్లు ఖాతాలో వేసుకుంటున్నారు. అ!, హిట్, హిట్-2 సినిమాలే దీనికి ఉదాహరణ. తాజాగా ఆ జాబితాలోకి కోర్టు మూవీ చేరిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంత్ వర్మ, శైలేశ్ కొలను, తాజాగా కోర్టు సినిమాతో రామ్ జగదీశ్ వంటి దర్శకులను పరిచయం చేశారు. దీంతో నయా టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో నాని ముందుంటారని అంటున్నారు.
News March 14, 2025
రాజమండ్రి: గోదావరి నదిలో దూకి దంపతుల ఆత్మహత్య

రాజమండ్రి వద్ద గోదావరిలో దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాకినాడ నగరం తూరంగి డ్రైవర్స్ కాలనీకి చెందిన భార్యభర్తలు కాళ్ల వెంకట రమణ, వరలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. స్థానిక మార్కండేయ స్వామి ఆలయం ఘాట్ వద్ద ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టానికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 14, 2025
కాళ్ల : బతుకుదెరువు కోసం వస్తే జీవితాలు ఛిద్రమయ్యాయి!

బతుకుదెరువు కోసం ప.గో జిల్లా కాళ్ల మండలం జువ్వలపాలెం గ్రామం నుంచి ఇద్దరు బొలెరో వాహనంలో వచ్చారు. రొయ్య పిల్లలు తీసుకొని చల్లపల్లి మీదుగా స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు ఘంటసాల (మ) జీలగలగండి వద్ద నిద్రమత్తులో డ్రైవర్ లారీని ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వాహనాల్లో చిక్కుకున్న మృతదేహాలు బయటికి తీయడానికి పోలీసులు శ్రమించారు.