News December 30, 2025
జవాబుదారీతనం పెంచడానికి సమాచార హక్కు చట్టం కీలకం: మెదక్ అదనపు కలెక్టర్

పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి సమాచార హక్కు చట్టం కీలకమని అదనపు కలెక్టర్ మెంచు నగేశ్ అన్నారు. సమాచార హక్కు చట్టం-2005పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పౌరులకు చట్టం విధానాలు, దరఖాస్తు ప్రక్రియ, సమాచారం పొందే హక్కులు గురించి వివరంగా తెలియజేశారు. పౌర సమాచార అధికారులు (PIO), సహాయ PIOలు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. చట్టం ప్రకారం 30 రోజుల్లో సమాచారం అందించాలన్నారు.
Similar News
News December 31, 2025
మెదక్: ప్రజలకు న్యూ ఇయర్ విషేష్ తెలిపిన మంత్రి

ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ నూతన సంవత్సర (2026) శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసి, కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.
News December 31, 2025
మెదక్: 9 చెరువుల నుంచి నీరు విడుదలకు నిర్ణయం: కలెక్టర్

రబీ 2025-26 సంవత్సరానికి గాను జిల్లాలో 500 ఎకరాలకు పైబడి ఆయకట్టు ఉన్న 9 చెరువుల నుంచి పంటలకు నీరు విడుదలకై చర్చించి నిర్ణయించినట్లు కలెక్టర్ రాహుల్ తెలిపారు. పెద్ద చెరువు కొంటూరు, హైదర్ చెరువు నార్లాపూర్, రాయరావు చెరువు నర్సాపూర్, దేవతల చెరువు వెల్దుర్తి, హల్దీ వాగు ప్రాజెక్టు హకీంపేట్, పెద్ద చెరువు అంబాజీపేట ఉన్నాయి.
News December 31, 2025
మెదక్: ఉద్యోగుల బకాయిల విడుదలకు హరీశ్ రావు చొరవ

డిసెంబర్ 29న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పోలీసు ఉద్యోగులకు సరెండర్ లీవ్స్, టీఏ, డీఏలు, స్టేషన్ అలవెన్సులు చెల్లించడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అసెంబ్లీలో ఆయన గొంతెత్తిన 24 గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం సరెండర్ లీవ్స్‌తో పాటు పెండింగ్ బిల్లులను విడుదల చేసింది. తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన హరీశ్ రావుకు పోలీసు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.


