News March 16, 2025
జహీరాబాద్లో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

జహీరాబాద్ మండలం హుగ్గెల్లీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బసవ కళ్యాన్ వెళ్తున్న బైక్ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ప్రదీప్(22) అక్కడికక్కడే మృతి చెందాడు. అతని చెల్లెలు ఆశ(18) తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం బీదర్ దవాఖానకు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రదీప్ మృతదేహం ప్రస్తుతం ప్రభుత్వ దవాఖాన మార్చురీలో ఉంది.
Similar News
News March 16, 2025
పీయూ బీఈడీ మూడో సెమిస్టర్ టైమ్ టేబుల్ విడుదల

మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా పాలమూరు యూనివర్సిటీ పరిధిలో బీఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల టైమ్ టేబుల్ యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ప్రతి రోజు పరీక్షలను మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు పూర్తి టైమ్ టేబుల్ యూనివర్సిటీ వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు తెలిపారు. విద్యార్థులు గమనించాలని కోరారు. SHARE IT
News March 16, 2025
రేపటి నుంచే రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ

TG: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. OBMMS ఆన్లైన్ పోర్టల్లో ఏప్రిల్ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కింద SC, ST, BCలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ₹3 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనుంది. 60%-80% వరకు రాయితీ ఇస్తారు. దాదాపు 5 లక్షల మందికి ₹6వేల కోట్ల ఖర్చుతో ఈ రుణాలను అందించనుంది. వివరాలకు http//tgobmms.cgg.gov.in/ సంప్రదించండి.
News March 16, 2025
ఆ టీడీపీ నేతలను కచ్చితంగా జైలుకు పంపుతాం: కాకాణి

అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్, ఎర్రచందనం కొల్లగొట్టిన వారిని వదిలే ప్రశక్తే లేదని మాజీ మంత్రి కాకాణి హెచ్చరించారు. 2014లో CM చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్ కుంభకోణం వెలుగులోకి వచ్చిందన్న ఆయన.. బాధ్యులపై చంద్రబాబు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 15 ఏళ్లలో అగ్రిగోల్డ్ భూముల్లో దాదాపు రూ.3.5కోట్ల వృక్ష సంపదను టీడీపీ నేతల కొల్లగొట్టారని, వారిని జైలుకు పంపుతామని కాకాణి వార్నింగ్ ఇచ్చారు.