News February 12, 2025
జహీరాబాద్: జల వాగులో మహిళ మృతదేహం లభ్యం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739277039886_60269218-normal-WIFI.webp)
జహీరాబాద్ నియోజకవర్గంలోని గొల్యాల హద్నూర్ గ్రామ శివారులోని జల వాగులో గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యమైనట్లు జహీరాబాద్ రూరల్ సీఐ జుక్కల్ హనుమంతు తెలిపారు. మహిళా వయసు 45- 50 ఏళ్లు ఉంటాయని, ఒంటిపై నల్లటి శెట్టర్, పసుపు రంగు పట్టుచీరతో ఉన్న మహిళ మృతదేహం వాగులో కొట్టుకొచ్చినట్లు ఉందని తెలిపారు. నాలుగు రోజుల క్రితం చనిపోయి ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News February 12, 2025
కాకినాడ: జగన్ స్కాములపై విచారణ తప్పనిసరి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739288378523_51351669-normal-WIFI.webp)
గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై సీబీఐ, ఈడి సంస్థలతో విచారణ చేయించాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో తాడేపల్లి కేంద్రంగా జరిగిన స్కాముల వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టపోయిందని పేర్కొన్నారు. రూ. 20 వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ ఇందులో ప్రధానమైందని రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం జగన్ పై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలన్నారు.
News February 12, 2025
అనంత: టెన్త్ అర్హతతో 66 ఉద్యోగాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739278281719_672-normal-WIFI.webp)
అనంతపురం జిల్లా (డివిజన్)లో 66 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీ వరకు https://indiapostgdsonline.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News February 12, 2025
గద్వాల్: ఘనంగా భూలక్ష్మి చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739300610010_51649205-normal-WIFI.webp)
గద్వాల్ జిల్లా కేంద్రంలోని భూలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి లింగం బావిలో తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ పూజారులు విగ్రహాలను లింగం బావిలో ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల హర్షధ్వానాల మధ్య విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు. ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు గద్వాల్ పట్టణ ప్రజలు భారీగా హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.