News June 26, 2024

జహీరాబాద్: పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటయ్యేనా..?

image

పాస్ పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు అవుతుంది ఇక సేవలు పొందడం సులువని భావించిన సంగారెడ్డి జిల్లా వాసులకు నిరీక్షణ తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాలో 2వ పెద్ద పట్టణంగా పేరొందిన జహీరాబాద్‌లో పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు 2018లో విదేశీ వ్యవహారాల శాఖ ఉత్తర్వులిచ్చింది. ఆరేళ్లు ధాటినా సేవా కేంద్రం ఏర్పాటు ఉత్తర్వులకే పరిమితమైంది. MP షెట్కార్‌ దృష్టిసారిస్తే ఎదురు చూపులు ఫలించే అవకాశముంది.

Similar News

News June 29, 2024

సంగారెడ్డి: నేడు తార డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా

image

సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపికైన వారికి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. SHARE IT

News June 29, 2024

SRD: ప్రభుత్వ పాఠశాలల ఆడిట్ షెడ్యూల్ విడుదల

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, కేజీబీవీ, యూఆర్ఎస్, ఆదర్శ పాఠశాలలకు సంబంధించిన నిధులపైన జూలై 20 నుంచి 22 వరకు ఆడిట్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆడిట్లకు సంబంధించిన అన్ని రకాల యూసీలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

News June 29, 2024

సంగారెడ్డి: ‘మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి’

image

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మహిళా సాధికారత సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థిక క్రమశిక్షణలో ముందుంటారని చెప్పారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్డిఓ జ్యోతి పాల్గొన్నారు.