News April 24, 2024

జహీరాబాద్: బీబీపాటిల్ ఆస్తులు ఇవే..!

image

జహీరాబాద్ BJP అభ్యర్థి బీబీపాటిల్‌ తన కుటుంబ ఆస్తులు రూ.151.69 కోట్లుగా ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. వివిధసంస్థల్లో రూ.1.88 కోట్ల విలువైన షేర్లు, పాటిల్‌ దంపతులిద్దరూ రూ.4.51 కోట్ల అప్పులు, అడ్వాన్సులు ఇచ్చారు. 18 వాహనాలు, 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 129.4 తులాల బంగారం, 1.93కిలోల వెండి ఉంది. 61.10 ఎకరాల వ్యవసాయ, 65.8 ఎకరాల వ్యవసాయేతర భూమి, 2 వాణిజ్య భవనాలు, 3.52కోట్ల అప్పులున్నాయి.

Similar News

News September 11, 2025

నిజామాబాద్: కుక్కర్ పేలి మధ్యాహ్న భోజన కార్మికురాలికి గాయాలు

image

అమ్రాద్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు లలితకు తీవ్రగాయాలు అయ్యాయి. స్కూల్లో వంట చేస్తున్న సమయంలో కుక్కర్ పేలింది. దీంతో ఆమెను నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమెను ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్‌తో చర్చించారు.

News September 11, 2025

NZB: అడ్మిషన్లకు రెండు రోజులు మాత్రమే

image

2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ , ప్రైవేటు, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల్లో ఇంటర్ అడ్మిషన్ల లాగిన్ ఓపెన్ చేసేలా ఈ నెల 11, 12 తేదీల్లో ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందని నిజామాబాద్ DIEO తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. ఇంటర్ బోర్డు ఆదేశానుసారం ప్రైవేటు కళాశాల్లో నామినల్ రోల్ కరెక్షన్ కోసం రూ.200 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ఎలాంటి రుసుం ఉండదన్నారు.

News September 11, 2025

NZB: వాహనంపై నుంచి పడి వ్యక్తి మృతి

image

నిజామాబాద్ సుభాష్ నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. బుధవారం ఉదయం ఖిల్లా ప్రాంతానికి చెందిన మహేష్(32) వాహనంలో వెనుక కూర్చొని వెళ్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్ల మహేష్ కింద పడి గాయలపాలయ్యాడు. అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.