News December 24, 2025

జహీరాబాద్‌: మాజీ సబ్‌ రిజిస్ట్రార్‌, కమిషనర్‌పై కేసు నమోదు

image

భూవివాదంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అప్పటి సబ్‌ రిజిస్ట్రార్‌ అబ్దుల్ హఫీజ్, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు పట్టణ SI వినయ్ కుమార్ తెలిపారు. 2018లో ZHBకు చెందిన నరసింహారెడ్డి, వేణుగోపాల్‌తో కలిసి HYDకు చెందిన వినోబా ఓ వెంచర్ ఏర్పాటు చేశారు. అయితే రూల్స్ ఉల్లంఘించి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి తనను మోసం చేశారని బాధితుడి ఫిర్యాదుతో అధికారులు సహానలుగురిపై కేసు నమోదైంది.

Similar News

News December 28, 2025

తగ్గిన మరణాలు, పెరిగిన ప్రమాదాలు…

image

తిరుపతి జిల్లాలో 2024లో 1143 రోడ్డు ప్రమాదాల్లో 541 మంది మృతి చెందగా, 2025లో ప్రమాదాలు 1148కి చేరినా.. మృతుల సంఖ్య 513కు తగ్గింది. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, ఓవర్ స్పీడింగ్, మద్యం సేవించి డ్రైవింగ్ కేసులు భారీగా నమోదయ్యాయి. దీంతో SP ‘నో హెల్మెట్–నో పెట్రోల్’ విధానం కఠినంగా అమలు చేస్తున్నారు. 2025లో ఈ-చలానాల ద్వారా 1.65 లక్షల కేసులు నమోదు చేసి రూ.9.86 కోట్ల జరిమానా వసూలు చేశారు.

News December 28, 2025

భారత్‌కు హాదీ హంతకులు.. ఖండించిన BSF

image

బంగ్లాదేశ్‌ యువనేత హాదీ హత్య కేసులో నిందితులు భారత్‌లోకి ప్రవేశించారన్న <<18694542>>ప్రచారాన్ని<<>> మేఘాలయ పోలీసులు, BSF ఖండించాయి. కాగా నిందితులు భారత్‌లోకి వచ్చి తురా సిటీకి చేరుకున్నారని ఢాకా పోలీసులు ఆరోపించారు. అయితే దీనిపై భారత్‌కు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదన్నారు. అదే విధంగా స్థానికులు, టాక్సీ డ్రైవర్ పాత్రపై కూడా ఆధారాల్లేవన్నారు. అయినప్పటికీ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్నారు.

News December 28, 2025

మల్కాజిగిరి: సదరం సర్టిఫికెట్లు పొందేందుకు తేదీలివే

image

మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలకు సంబంధించిన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రిలో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు. జనవరి 6, 8, 20, 22, 24, 27, 29, 31 తేదీల్లో ఈ శిబిరాలు ఉంటాయని గ్రామీణాభివద్ధి శాఖాధికారి సాంబశివరావు తెలిపారు. స్లాట్ రిసిప్టుతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేయించుకున్న మెడికల్ సర్టిఫికెట్‌తో హాజరుకావాలని తెలిపారు.