News February 17, 2026

జహీరాబాద్ మున్సిపల్ పీఠం.. వీడిన ఉత్కంఠ

image

జహీరాబాద్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఛైర్మన్‌గా 5వ వార్డు కౌన్సిలర్ యూనుస్, వైస్ ఛైర్మన్‌గా 16వ వార్డు కౌన్సిలర్ శిరీష రెడ్డి ఎన్నికయ్యారు. సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్, ఖేడ్, కోహీర్ కాంగ్రెస్ కైవసం చేసుకోగా, పటాన్‌చెరు పరిధిలోని 5 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ దక్కించుకుంది. ఈ ఎన్నిక రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది.

Similar News

News February 22, 2026

లడ్డూ తప్ప రాష్ట్రంలో ఇంకే సమస్య లేదా: అంబటి

image

AP: వైసీపీ చీఫ్ జగన్‌పై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. లడ్డూ తప్ప రాష్ట్రంలో ఇంకే సమస్య లేదా? అని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న CM చంద్రబాబు తిరుమల శ్రీవారి ఆగ్రహానికి గురవ్వక తప్పదని హెచ్చరించారు. లడ్డూ వ్యవహారంపై సీబీఐ కమిటీ ఛార్జ్‌షీట్ ఫైల్ చేసిందని, అయినా దానిపై వక్రభాష్యాలు ఎందుకని నిలదీశారు. ప్రజలకు వాస్తవమేంటో తెలుసని చెప్పారు.

News February 22, 2026

భీమవరం: రేపు 10గం.ల నుంచి 1 గంట వరకే ఈ కార్యక్రమం

image

భీమవరం కలెక్టరేట్‌ జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం PGRSను యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ నాగరాణి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్, వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30ని.ల వరకు అర్జీలను స్వీకరిస్తామన్నారు.

News February 22, 2026

నెల్లూరు: జైల్లో పొక్సో కేసు నిందితుడి మృతి.!

image

నెల్లూరు సెంట్రల్ జైల్లో పొక్సో కేస్ నిందితుడు మట్టి సుబ్బారావు (58) ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. విజయవాడ భవానిపురానికి చెందిన సుబ్బారావు పది నెలలుగా ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో శిక్ష అనుభవిస్తూ చనిపోయాడు. మృతదేహానికి ఆర్డీవో, MRO, వెంకటాచలం పోలీసులు సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు.