News April 8, 2025

జహీరాబాద్: యువకుడి దారుణ హత్య

image

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ధనశ్రీ గ్రామంలో అబ్బాస్ (25)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. అబ్బాస్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి స్నేహితులతో విందుకు వెళ్లి గ్రామ శివారులో దాడికి గురయ్యాడు. దాడిలో అబ్బాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ రాజేందర్ రెడ్డి విచారణ చేపట్టారు.

Similar News

News November 8, 2025

గుండెల్లో మంటా?.. నిర్లక్ష్యం చేయొద్దు!

image

మసాలా ఫుడ్ తిన్న తర్వాత పలువురు గుండెల్లో మంటతో ఇబ్బంది పడతారు. ఎప్పుడైనా ఒకసారి గుండెల్లో మంట వస్తే ఫర్వాలేదు. కానీ తరచూ అదే సమస్య ఎదురైతే చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే అన్నవాహిక సమస్య ఏర్పడుతుందని, కొన్ని సందర్భాలలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత అన్నవాహిక స్పింక్టర్ మూసుకోకపోవడం వల్లే గుండెల్లో మంట వస్తుందని వివరించారు.

News November 8, 2025

లాలూ 7 జన్మలెత్తినా మోదీ కాలేరు: అమిత్ షా

image

ఏడు జన్మలెత్తినా లాలూ ప్రసాద్ యాదవ్ చేసినట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ కుంభకోణాలు చేయలేరని కేంద్ర మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. రైల్వేకు లాలూ తీసుకొచ్చిన లాభాలను మోదీ ఎన్నటికీ తీసుకురాలేరన్న తేజస్వీ యాదవ్ కామెంట్లకు షా కౌంటరిచ్చారు. బిహార్‌లోని పూర్ణియాలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. అక్రమ వలసదారులను గుర్తిస్తామని, వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి దేశం నుంచి పంపిస్తామని చెప్పారు.

News November 8, 2025

రేపు రాజమండ్రిలో ఉద్యోగమేళా

image

మెప్మా, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 9న (ఆదివారం) రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనక రాజు శనివారం తెలిపారు. విభిన్న రంగాలకు చెందిన 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. టెన్త్ నుంచి పీజీ, బీటెక్, నర్సింగ్ చేసిన వారు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.