News October 9, 2025
జాగో.. జాగో అంటున్న ప్రకాశం పోలీస్!

జిల్లాలోని రహదారుల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు అధికం. డ్రైవర్ కాస్త ఏమరపాటుగా నిద్రలోకి జారితే చాలు.. జరిగే ప్రమాదాన్ని ఊహించలేం. అందుకే ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో జిల్లాలోని నేషనల్ హైవేలలో వాష్ అండ్ గో కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. గత నెలకు సంబంధించి 2200 మంది లారీ డ్రైవర్లకు వాష్ అండ్ గో కార్యక్రమం ద్వారా మేలుకొలిపినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం గురువారం ప్రకటించింది.
Similar News
News October 10, 2025
ప్రకాశం: ‘సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం’

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా వ్యవహరించడంతోపాటు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవల పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ వ్యాధులు – మందుల పంపిణీ అంశాలపై జేసీ గోపాలకృష్ణ వీడియో కాన్ఫరెన్స్లో వివరణ ఇచ్చారు.
News October 9, 2025
త్రిపురాంతకం వద్ద యాక్సిడెంట్.. ఒకరి మృతి

త్రిపురాంతకంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేడపి సమీపంలోని మానేపల్లి రహదారిలో ద్విచక్ర వాహనం – బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 9, 2025
ప్రకాశం: నర్సింగ్ జాబ్స్ కావాలా..ఈ ఛాన్స్ మిస్ కావద్దు.!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం నర్సింగ్ చదివిన అభ్యర్థులకు హోం కేర్ నర్సులుగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సంబంధిత కార్పొరేషన్ ఈడీ హైఫా తెలిపారు. ప్రకాశం జిల్లాలో మైనారిటీస్ అభ్యర్థులు సంబంధిత వెబ్ సైట్లో ఈ నెల 12 లోగా దరఖాస్తు చేయాలన్నారు. ఎంపికైన వారు ఖతార్, దోహాలలో పని చేయాలన్నారు. వివరాలకు ఒంగోలు స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.