News October 19, 2025
జాగ్రత్తగా దీపావళి జరుపుకోవాలి: ఎస్పీ రాహుల్ మీనా

దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చిన్న పిల్లలు తప్పనిసరిగా పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆయన కోరారు.
Similar News
News October 19, 2025
ఘనంగా పైడిమాంబ కలశ జ్యోతి ఊరేగింపు

ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో, వేద పండితులు పైడిమాంబ దీక్ష దారులు పెద్ద సంఖ్యలో ఆదివారం సాయంత్రం పైడితల్లి అమ్మవారి వనంగుడి నుండి చదురగుడి వరకు కలశ జ్యోతి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News October 19, 2025
గజ్వేల్: పీహెచ్‌సీ తనిఖీ చేసిన కలెక్టర్.. సీరియస్

గజ్వేల్ మండలం అహ్మదీపూర్ పీహెచ్‌సీని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించిన కలెక్టర్, సంతకాల్లో తేడాలు గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి రాకుండానే సంతకాలు చేసినట్లు గుర్తించి, సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీఎంహెచ్ఓను ఆదేశించారు.
News October 19, 2025
భువనగిరి: ఎక్స్‌పైరీ ఇంజెక్షన్ ఇచ్చిన ఇద్దరు సస్పెండ్

తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గడువు ముగిసిన ఇంజెక్షన్ ఇచ్చిన ఘటనపై కలెక్టర్ హనుమంతరావు కఠిన చర్యలు తీసుకున్నారు. విచారణలో నిర్లక్ష్యం రుజువు కావడంతో NHM రజిత, ఫార్మసీ ఆఫీసర్ మహేశ్వరిని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.