News November 19, 2025
జాగ్రత్త.. ఆదమరిస్తే అంతే సంగతులు..!

మహిళలు, అమ్మాయిలు బైక్ నడిపే సమయంలో, బైక్ వెనకాల కూర్చునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వారు ధరించిన చున్నీలు, స్కార్ఫ్స్, చీరలు బైక్ వీల్స్లో పడకుండా తప్పనిసరిగా సరి చూసుకోవాలి. పొరపాటున అవి చక్రంలో పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆదివారం GDKలో ఓ మహిళ చీర కొంగు బైక్ వీల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. కాగా, PDPLలో రెండు బైకులు అదుపు తప్పిన ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
Similar News
News November 21, 2025
SRSP: 947.474 TMCల వరద

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఈ ఏడాది జూన్ 1 నుంచి నేటి వరకు 947.474 TMCల వరద వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రాజెక్టు నుంచి 879.761 TMCల అవుట్ ఫ్లో కొనసాగిందన్నారు. కాగా గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి యావరేజ్‌గా 3,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు వివరించారు.
News November 21, 2025
చిత్తూరు: రాగుల పంపిణీకి చర్యలు

చిత్తూరు జిల్లాలోని రేషన్ షాపుల్లో డిసెంబరు నెల నుంచి రాగులు, జొన్నలు పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ లక్ష్మి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం జిల్లాకు 350 టన్నుల జొన్నలు, 350 టన్నుల రాగులను కేటాయించిందన్నారు. చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో వీటిని పంపిణీ చేస్తామన్నారు. కార్డుదారులకి ఇస్తున్న బియ్యం కోటాలో ఒక్కొక్క కేజీ వంతున రాగులు, జొన్నలు అందజేస్తామని చెప్పారు.
News November 21, 2025
పల్నాడు: కాలువల మరమ్మతులలో నిధుల దుర్వివినియోగం

పల్నాడు ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో మేజర్, మైనర్ కాలువల మరమ్మతులలో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమైనట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలిసింది. అధికారుల సహాయంతో కొందరు నేతలు కాలువలకు మరమ్మతులు చేయకుండానే చేసినట్లు చూపి బిల్లులు చేసుకున్నట్లు సమాచారం. రైతుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్ ఎంక్వయిరీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.


