News January 1, 2026
జాగ్రత్త.. ఉమ్మడి ఖమ్మంలో దట్టమైన పొగమంచు!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రానున్న రోజుల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చలి తీవ్రతకు తోడు పొగమంచు వల్ల రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వేగాన్ని తగ్గించి వాహనాలను నడపాలని సూచించారు. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం ప్రజలను కోరింది.
Similar News
News January 2, 2026
HYD: AI కోర్సులకు ఫ్రీగా ఆన్‌లైన్ శిక్షణ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ML, డేటా సైన్స్ తదితర సాఫ్ట్‌వేర్ కోర్సులకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ఆమోదిత సర్టిఫికెట్ ప్రదానం చేస్తామని తెలిపారు. అసక్తిగల అభ్యర్థులు జనవరి 15లోగా nationalskillacademy.inలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News January 2, 2026
పల్నాడు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి.. అప్డేట్

మార్కాపురానికి చెందిన షేక్ కరీముల్లా (50), మాచర్లకు చెందిన నూర్జహాన్(45) బంధువులు. ఇద్దరూ ఫ్రూట్స్ బిజినెస్ చేస్తుంటారు. మాచర్ల నుంచి మార్కాపురానికి బైకుపై గురువారం బయల్దేరారు. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన మహేశ్ బైకుపై మాచర్లకు పయనమయ్యాడు. శిరిగిరిపాడు వద్ద ఈ రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కరీముల్లా, నూర్జహాన్ <<18735450>>చనిపోగా<<>> మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు.
News January 2, 2026
NLG: మున్సిపాలిటీలలో మహిళా ఓటర్లే అధికం..!

మున్సిపాలిటీ ఎన్నికల ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైంది. దీని ప్రకారం ఉమ్మడి జిల్లా పరిధిలోని 18 మున్సిపాలిటీల్లో మొత్తం 6,65,585 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 3,42,873 మంది కాగా, పురుష ఓటర్లు 3,22,617 మంది, ట్రాన్స్‌జెండర్లు 95 మంది ఉన్నారు. ఎన్నికలు జరగనున్న అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లు 20,256 మంది ఎక్కువగా ఉన్నారు.


