News December 27, 2025

జాగ్రత్త.. మరింత వణికించనున్న చలి

image

AP: రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అరకు, పాడేరు ప్రాంతాల్లో 4-12 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోనూ చలి పెరిగింది. ఉత్తర భారతం నుంచి గాలులు, హిమాలయాల్లో కురుస్తున్న భారీ మంచు వల్ల శీతల తరంగాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తుండటంతో చలి పెరిగిందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. వచ్చేవారం మరింత పెరిగే ఆస్కారముందని అంచనా వేస్తున్నారు.

Similar News

News February 17, 2026

VIRAL: ఇస్త్రీ మరకతో ఉన్న షర్టు ఖరీదు రూ.లక్ష!

image

ఫ్యాషన్ ప్రపంచంలో వింతలకు కొదువ లేదు. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ ‘VETEMENTS’ తాజాగా విడుదల చేసిన ఒక షర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇస్త్రీ చేస్తుండగా పొరపాటున చొక్కా కాలితే వచ్చే ‘ఐరన్ బర్న్’ మార్కును వీరు డిజైన్‌గా మార్చేశారు. దీని ధర $1,139 (సుమారు రూ. లక్ష). ఈ ధరను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి మరక పడితే ఇంట్లో గొడవ చేస్తామని, కానీ ఇదే ఓ ఫ్యాషన్ అయిందంటూ సెటైర్లు వేస్తున్నారు.

News February 17, 2026

నైరుతి మూలలో వాస్తు దోషాలు ఉంటే?

image

నైరుతి దిశలో వాస్తు లోపిస్తే అది ప్రమాదాలకు నిలయమవుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘తక్కువ ధరకు వస్తుందని ఇలాంటి స్థలాన్ని అస్సలు తీసుకోకూడదు. ఈ దోషం వల్ల కుటుంబ యజమానికి ప్రాణహాని, అకాల మరణాలు సంభవించే అవకాశం ఉంది. తీవ్రమైన వివాదాలు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిడి వల్ల జీవితంపై విరక్తి కలిగే పరిస్థితులు ఎదురవుతాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన వాస్తు దోషం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 17, 2026

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు

image

TG: పెరుగుతున్న ఎండల నేపథ్యంలో మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 8AM నుంచి 12:30PM వరకే బడులు నడపాలని ఆదేశించింది. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న స్కూళ్లలో 1PM నుంచి 5PM వరకు తరగతులు నిర్వహించాలని పేర్కొంది. APR 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం అవుతాయని పేర్కొన్న విద్యాశాఖ.. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని తెలిపింది.