News September 10, 2025

జాడలేని పులస.. విలసలకు డిమాండ్

image

కోనసీమ పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చేవి పులస చేపలు. వరదల సమయంలో సముద్రం నుంచి సంతానోత్పత్తికి గోదావరి నదిలోకి వచ్చే పులస జాడ లేక పోవడంతో మాంస ప్రియులు ఈ ఏడాది తీవ్ర నిరాశ చెందారు. దీంతో పులసను పోలి ఉండే విలసలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో సముద్రంలో దొరికే విలసలను ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం వీటి ధర కేజీ రూ.700 నుంచి రూ.1500 పలుకుతోంది. పులస లేని లోటును విలసలతో తీర్చుకుంటున్నారు.

Similar News

News September 10, 2025

బిడ్డకు జన్మనిచ్చిన మెగా కపుల్

image

టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మగబిడ్డకు జన్మనిచ్చారు. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి మూవీ సెట్ నుంచి ఆస్పత్రికి వెళ్లి వరుణ్, లావణ్యకు విషెస్ తెలిపారు. మెగా ఫ్యాన్స్ వారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తేజ్-లావణ్య వివాహం 2023 నవంబర్ 1న ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే.

News September 10, 2025

ఈనెల 23 నుంచి సింహాచలంలో శరన్నవరాత్రులు

image

సింహాచలంలో శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్ర ఉత్సవములు ఈనెల 23 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగనున్నాయిని ఈ.ఓ వేండ్ర త్రినాథరావు బుధవారం తెలిపారు. ప్రతిరోజూ విశేష ఉత్సవములు, రామాయణ పారాయణం, సాయంత్రం బేడా తిరువీధి ఉత్సవాలు జరుగుతాయన్నారు. OCT 02న విజయదశమి సందర్భంగా శమీపూజ మహోత్సవం, పూలతోటలో జమ్మి వేటతో జరుగుతాయన్నారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు దర్శనం కల్పిస్తామన్నారు.

News September 10, 2025

కడప మేయర్ సురేశ్ బాబుకు మరోసారి నోటీసులు

image

కడప నగరపాలక సంస్థ మేయర్ సురేశ్ బాబుకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 17న హాజరుకావాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ నోటీసులు పంపారు. ఇదే చివరి అవకాశం అంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలకు కాంట్రాక్ట్ పనులు మంజూరు చేసినట్లు వచ్చిన ఆరోపణల కారణంగా కోర్టు నోటీసులు జారీ చేసింది.