News December 18, 2025
జాతక దోష నివారణ క్షేత్రం ‘శ్రీకాళహస్తి’

శ్రీకాళహస్తిశ్వర క్షేత్రం జాతక దోష నివారణకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రాహుకేతు పూజలు చేస్తే వైవాహిక అడ్డంకులు, సంతానలేమి సమస్యలు తొలగిపోతాయని ప్రతీతి. ఈ క్షేత్రంలోని వాయు లింగానికి ప్రాణం ఉందని, గర్భగుడిలో అఖండ జ్యోతి ఎప్పుడూ వెలుగుతూ ఉంటుందని నమ్ముతారు. రాహుకేతు పూజ తర్వాత భక్తులు నేరుగా ఇంటికే వెళ్లాలని పండితులు సూచిస్తున్నారు. జాతక దోషాలు, వాటి నివారణ మార్గాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
Similar News
News December 18, 2025
22న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

AP: జనసేన బలోపేతంపై ఆ పార్టీ చీఫ్, Dy.CM పవన్ కళ్యాణ్ దృష్టిసారించారు. ఇందులో భాగంగా నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో ఈ నెల 22న విస్తృత సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. ‘పదవి-బాధ్యత’ పేరుతో మంగళగిరిలో జరిగే ఈ భేటీలో నాయకులకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, MLAలు, MLCలు, MPలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా స్థాయి పదవుల్లో ఉన్నవారు హాజరుకావాలని ఆదేశించారు.
News December 18, 2025
ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో చలి, పొగమంచు తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజలు ఉదయం బయట అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు. TGలో 2-3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, కామారెడ్డి, వరంగల్, వికారాబాద్ జిల్లాలకు YELLOW ALERT ఇచ్చింది. అటు APలోని మన్యంలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి.
News December 18, 2025
OG కోసం సొంత కారు అమ్మిన డైరెక్టర్!

డైరెక్టర్ సుజీత్‌కు హీరో పవన్ కళ్యాణ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును గిఫ్ట్ ఇచ్చిన <<18579913>>విషయం<<>> తెలిసిందే. ఆ కారును పవన్ గిఫ్ట్‌గా ఎందుకిచ్చారో సినీవర్గాలు తెలిపాయి. ‘OGలోని కొన్ని సీన్లు జపాన్‌లో షూట్ చేద్దామనుకుంటే బడ్జెట్ వల్ల నిర్మాత ఒప్పుకోలేదు. ఈ సీన్ ప్రాధాన్యం దృష్ట్యా సుజీత్ తన కారు అమ్మేసి షూట్ పూర్తిచేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్.. అదే మోడల్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు’ అని పేర్కొన్నాయి.


