News January 29, 2026
జాతరలో కనిపించని కొండా సురేఖ.. కారణమేంటి?

TG: మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. అయితే దేవదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి సంబంధిత మంత్రి కొండా సురేఖ వెళ్లకపోవడం గమనార్హం. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను చూసుకుంటున్నారు. మేడారంలో అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో సురేఖ, పొంగులేటి మధ్య వివాదాలే ఆమె దూరంగా ఉండటానికి కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Similar News
News February 20, 2026
బంగ్లాకు వీసా సర్వీసుల పునరుద్ధరణ

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు బంగ్లాదేశ్ PM తారిఖ్ రెహ్మాన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్నిరకాల వీసా సర్వీసుల పున:ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవాళ ఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ రీఓపెన్ అయ్యింది. త్వరలోనే IND కూడా సర్వీసులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. బంగ్లాలో హాదీ హత్యతో అల్లర్లు చెలరేగడం, అక్కడి హిందువులపై దాడితో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.
News February 20, 2026
నవజాత శిశువుల్ని ఇలా రక్షిద్దాం..

నవజాత శిశువుల్లో 80 శాతం మంది నెలలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని యునిసెఫ్ నివేదిక తెలిపింది. వీటిని నివారించడానికి న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. పుట్టిన 48-96 గంటల మధ్య ఈ పరీక్ష చేస్తారు. శిశువు మడమ నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనివల్ల వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల శారీరక, మానసిక వైకల్యాలతో సహా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.
News February 20, 2026
TN CM స్టాలిన్‌తో పన్నీరు సెల్వం భేటీ

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. మాజీ CM, AIADMK బహిష్కృత నేత పన్నీరు సెల్వం CM స్టాలిన్‌ను కలిశారు. ఐదేళ్ల DMK పాలనను కొనియాడారు. త్వరలో రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో DMK మరోసారి విజయం సాధిస్తుందన్నారు. CMను కలిసి ఐదేళ్ల పాలన బాగుందని చెప్పి శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ భేటీతో పన్నీరుసెల్వం వర్గం DMKతో ఎన్నికలకు వెళ్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.


