News March 15, 2025
జాతరేమో పరకాలలో.. రాజకీయమంతా నర్సంపేటలో..!

గీసుకొండ మండలం కొమ్మాల జాతర పాలన పరంగా పరకాల నియోజకవర్గంలో ఉంటుంది. కానీ ఈ జాతర ప్రభావం రాజకీయంగా నర్సంపేట నియోజకవర్గంలోనే ఎక్కువగా జరుగుతోంది. జాతరకు నెల రోజుల ముందు నుంచే దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి మండలాల్లో రాజకీయ పార్టీల నేతలు ప్రభ బండ్లను కడుతారు. ఏటా ఈ ప్రభ బండ్ల విషయంలో నర్సంపేటలో రాజకీయ గొడవలు జరుగుతూనే ఉంటాయి. పోలీసులకు జాతర అగ్ని పరీక్షలా మారుతోంది.
Similar News
News October 25, 2025
రేపటి నుంచి 3 రోజులు బీచ్‌కి రావొద్దు: ఎస్సై

తుపాన్ హెచ్చరికల జారీ, సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగిన కారణంగా ఈ నెల 26 నుంచి 28 వరకు పేరుపాలెం బీచ్‌లోకి సందర్శకులకు అనుమతి లేదని మొగల్తూరు ఎస్సై వాసు శనివారం తెలిపారు. వాతావరణంలోని మార్పుల వల్ల అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు. సందర్శకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
News October 25, 2025
జిల్లా సర్వజన ఆసుపత్రిలో ఉచిత OP సేవలు: MP

ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లా సర్వజనాసుపత్రిలో వైద్యసేవల్ని మరింత విస్త్రృతం చేస్తున్నామని ఏలూరు MP పుట్టా మహేష్ కుమార్ చెప్పారు. శనివారం జిల్లా సర్వజనాసుపత్రిలో విజయవాడకు చెందిన ఓ న్యూరో & కార్డియాక్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత OP వైద్యసేవలను ఆయన ప్రారంభించారు. ఇకపై ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఉచిత OP సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
News October 25, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

* ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ నేతలతో కీలక భేటీ
* మద్యం దుకాణాల టెండర్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్
* త్వరలోనే 14,000 అంగన్‌వాడీ హెల్పర్ల నియామకం
* కర్నూల్ బస్సు ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రైవేటు బస్సుల్లో ముమ్మర తనిఖీలు
* హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కొనసాగుతున్న వర్షాలు


